Man Allegedly Chops Up Aunt’s Body: ఓ వ్యక్తి అత్తను చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి రోడ్డు పక్కన పడేశాడు. ఏం తెలియనట్లు తన అత్త కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇతని వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పోలీసు విచారణలో నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. అనుజ్ శర్మ అలియాస్ అచిత్య గోవింద్ దాస్(33) డిసెంబర్ 11న తన అత్త సరోజ్ శర్మ(65) సుత్తితో తలపై కొట్టి చంపాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి తాను కూడా వెతికినట్లు చేశాడు.
Read Also: Pathaan: వివాదంలో షారుఖ్ ఖాన్ “పఠాన్” మూవీ.. ఈ సారి ముస్లిం బోర్డు నుంచి అభ్యంతరం
అనుజ్ శర్మ గత 8 ఏళ్లుగా ‘హరే కృష్ణ’ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నాడు. అయితే తల్లి మరణం తర్వాత గతేడాది నుంచి ఈ ఉద్యమంలో యాక్టీవ్ గా లేడు. డిసెంబర్ 11న అనూజ్ శర్మ తండ్రి ఇండోర్ వెళ్లాడు. అనుజ్ తో పాటు అతని అత్త సరోజ్ ఇద్దరూ ఇంట్లో ఉన్నారు. కాగా.. అనూజ్ ఢిల్లీ వెళ్లాలని అనుకున్నాడు కానీ ఇందుకు అత్త సరోజ్ ఒప్పుకోలేదు. ప్రతీసారి తన విషయంలో అత్త జోక్యంపై తరుచు గొడవపడుతుండే వాడు. హత్య రోజు కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అనూజ్ సుత్తెతో సరోజ్ ను కొట్టి చంపాడు. ఆ తరువాత శరీరాన్ని బాత్ రూంలోకి తీసుకెళ్లి మార్చుల్ కట్టర్ తో 8-10 ముక్కలు చేశాడు. ఈ మొత్తం వివరాలను పోలీసుల విచారణలో అనూజ్ వెల్లడించాడు.
నిందితుడు ఓ సూట్ కేసును బయటకు తీసుకువెళ్తున్న వివరాలు సీసీ కెమరాలో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వంటగదిలో రక్తపు మరకలను శుభ్రం చేయడాన్ని గుర్తించామని కొంతమంది బంధువులు పోలీసులకు తెలిపారు. తన అత్త గుడికి వెళ్లిందని, ఆ తర్వాత నుంచి కనిపించడం లేదని పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు నిందితుడు. డిసెంబర్ 13న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఢిల్లీలో ఇటీవల జరిగిన శ్రద్ధా వాకర్ హత్యను పోలి ఉంది ఈ కేసు.
