తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్‌చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు మోడీ, మమత ఒక్కటయ్యారని ఆరోపించారు. దేశంలో అసలు యూపీఏ లేదని మమత చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. దీదీ, బీజేపీ సంబంధాలు పాతవేనని… తనతో పాటు, పార్టీని, మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కాపాడుకునేందు మోడీతో మమత లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే పలు మార్లు దీదీ మోడీ కలిసింది. మోడీని కలిసిన మమతాబెనర్జీ రాష్ర్టంలో సమస్యలపై, రాష్ర్టానికి రావాల్సిన నిధులు గురించి మాత్రమే మాట్లాడారని ఆమె స్పష్టం చేశారు.
కాగా గతంలో అభిషేక్ బెనర్జీ పై పలు ఆరోపణలు ఉన్నాయి. తనపై ఎలాంటి కేసులు పెట్టకుండా బీజేపీకి దీదీ కొమ్ము కాస్తున్నారని ఆయన విమర్శించారు. దీదీ గతంలో బీజేపీని విమర్శించి ఇప్పుడు ఆ పార్టీ పంచనే చేరడం పలు అనుమానాలకు తావు ఇస్తుందని అధీర్ రంజన్ చౌదరి అన్నారు. కాంగ్రెస్ పై విమర్శలు చేసే నైతిక హక్కు మమతాబెనర్జీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ధీటుగా సమాధానం చెబుతామని అధీర్ హెచ్చరించారు.
