NTV Telugu Site icon

Rekha Sharma: సీఎం మమతకు మహిళలంటే గౌరవం ఉండదు

Rekhasharma

Rekhasharma

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆయా రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్నారు. ఇక కోల్‌కతాలో ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా సేవలు బంద్ చేసి వైద్యులు, నర్సులు ఆందోళనకు దిగారు. వారికి రాజకీయ నాయకులు కూడా మద్దతుగా నిలిచారు. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు.

ఇది కూడా చదవండి: రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. మస్తాన్ సాయి ఫోన్ లో అమ్మాయిల వీడియోలు!!

తాజాగా ఇదే అంశంపై మాజీ జాతీయ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ రేఖ స్పందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మహిళలంటే గౌరవం ఉండదని పేర్కొన్నారు. మహిళల భద్రతను మమత సీరియస్‌గా తీసుకోరని ఆరోపించారు. అయినా ఎవరిని పడితే వారిని పౌర వాలంటీర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఆయా వ్యక్తుల నేపథ్యాన్ని పరిశీలించకుండా పౌర వాలంటీర్‌గా నియమిస్తారా? అని ఎక్స్ ట్విట్టర్ వేదికగా రేఖా శర్మ అడిగారు. ఇదిలా ఉంటే ఈ కేసులో పౌర వాలంటీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Rajasthan:సైనికుడిని స్టేషన్‌లో బట్టలు విప్పి కొట్టిన పోలీసులు.. మంత్రి ఫైర్

Show comments