Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘‘తెలివైన కుట్ర’’కు తెర తీశారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావని ఆమె హెచ్చరించారు. మాల్దా జిల్లాలో సర్ వ్యతిరేక బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఓటర్ల జాబితా ప్రక్రియ నిర్వహించడం ద్వారా బీజేపీ తన సమాధిని తానే తవ్వుకుంటోందని అన్నారు. బీజేపీ బెంగాల్‌ను స్వాధీనం చేసుకోలేదని, బెంగాల్ ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడూ మద్దతు ఇవ్వరని, బెంగాల్ బీహార్ కన్నా భిన్నమని మమతా అన్నారు.
Read Also: Bangladesh: భారత్ “ముక్కలైతేనే” బంగ్లాదేశ్‌కు శాంతి.. మాజీ ఆర్మీ అధికారి సంచలన వ్యాఖ్యలు..
తాము సర్‌ను వ్యతిరేకించడం లేదంటూనే, ఎన్నికల సమయంలో ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. బెంగాల్‌లో సర్ కారణంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారని, 13 మంది ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారని చెప్పింది. తాను బెంగాల్ ప్రజలకు ‘‘కాపలాదారు’’ని అని చెప్పారు. బీజేపీ మత శక్తులు ప్రజల్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశామని, తాను బతికి ఉన్నంత వరకు బెంగాల్‌ను తాకనివ్వనని, తాను మత రాజకీయాలను అనుమతించనని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ ఒక నల్లిపురుగు లాంటిదని, వాటిని తొలగించే వరకు కొరుకుతాయని చెప్పారు. బెంగాల్ ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లు తొలగించబడవని, ఎవరూ నిర్బంధ శిబిరాలకు వెళ్లరని ఆమె హామీ ఇచ్చారు.
