Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
- బెంగాల్ రాజకీయాల్లో కొనసాగుతున్న సస్పెన్స్..
- రాజీనామాకు ఒప్పుకోని మమతా బెనర్జీ..
- కీలకంగా మారిన గవర్నర్ అధికారాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: బీజేపీ ఘన విజయం సాధించి, టీఎంసీ ఘోర పరాజయం చూసిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని, రాజ్ భవన్ వెళ్లనని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీ ఎన్నికల ఫలితాలను దొంగిలించిందని, 100 నియోజకవర్గాల్లో విజయం దొంగిలించబడిందని ఆమె ఆరోపించారు. నైతిక విజయం తమదే అంటూ వ్యాఖ్యానించారు. బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 207 సీట్లను దక్కించుకుంది. అయితే, బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్మక్కు అయిందంటూ ఆమె ఆరోపించారు. తాను ఓడిపోలేదని స్పష్టం చేశారు.
సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార పార్టీ ఓడిపోతే సీఎం గవర్నర్‌కు తన రాజీనామా లేఖ సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది. అయితే, బెంగాల్ పరిణామాలు మాత్రం దేశానికి కొత్తగా ఉన్నాయి. ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగాలంటే ‘‘శాసన సభ’’ విశ్వాసం అనేది ప్రాథమిక సూత్రం. ఎన్నికల్లో ఓడిపోయానని తెలిసిన తర్వాత మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సి ఉంది. అయినా ఆమె ఇప్పటికే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
Also Read
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
గవర్నర్ రంగ ప్రవేశం:
సీఎం పదవికి రాజీనామా చేయనని మమతా బెట్టు చేస్తే, గవర్నర్ యాక్టీవ్ అయ్యే అవకాశం ఉంది. గవర్నర్ కొన్ని చర్యల్ని తీసుకోవచ్చు. ఇందులో రాష్ట్రపతి పాలనను సిఫారసు చేయవచ్చు. అంటే దీని అర్థం శాసనసభను రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావచ్చు.
మరో చర్య ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టిలక్ 164(1)ను ఉపయోగించే అవకాశం ఉంది. దీని ప్రకారం, ముఖ్యమంత్రి ఆమె మంత్రివర్గం ‘‘గవర్నర్ విశ్వాసం ఉన్నంత కాలం’’ పదవిలో కొనసాగుతారు. దీని ద్వారా గవర్నర్ ఆమెను పదవి నుంచి తొలగించవచ్చు. ఇదే సమయంలో మరో ఆప్షన్ కూడా గవర్నర్ వద్ద ఉంది. మమతా బెనర్జీని తన మెజారిటీ నిరూపించుకోవచ్చని ఆదేశించవచ్చు. అయితే, దీనికి చాలా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 80 స్థానాలు మాత్రమే లభించాయి. ఇది మెజారిటీ మార్కు కన్నా 68 సీట్లు తక్కువ.
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!