Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..

  • టీఎంసీ 200కు పైగా స్థానాల్లో గెలుస్తుంది..
  • స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
  • గెలుపుపై ధీమా వ్యక్తం చేసి మమతా బెనర్జీ..
Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తాము 200కు పైగా సీట్లను గెలుచుకోబోతున్నామని చెప్పారు. స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేయడానికే ఎగ్జిట్ పోల్స్ అంటూ ఆరోపణలు వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆమె కొట్టిపారేశారు.

Read Also: China-Pakistan: పాకిస్తాన్‌కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్‌కు ముప్పు..

ఓట్ల లెక్కింపుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పోరాడిన టీఎంసీ కార్యకర్తల్ని అభినందించారు. టీఎంసీ 200కు పైగా సీట్లలో గెలుస్తుందని పార్టీ సభ్యులతో ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్‌ను ప్రభావితం చేయడానికి ఎగ్జిట్‌ పోల్స్‌ను సాధనంగా ఉపయోగించుకున్నట్లు ఆమె ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ 2021, 2024లో కూడా ఇదే చేశారని అన్నారు.

ఎన్నికల సమయంలో బెంగాల్ వ్యాప్తంగా మోహరించిన కేంద్ర బలగాలపై కూడా మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర బలగాలు క్రూరంగా వ్యవహరించాయని ఆరోపించారు. ఓటర్లు, ముఖ్యంగా మహిళల్ని భయపెట్టేందుకు బీజేపీ కేంద్ర బలగాలను వాడుకుందని మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. మీడియాలోని ఒక వర్గం కూడా బీజేపీకి సహకరిస్తుందని చెప్పారు.