దేశమంతటా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా రూల్స్‌ను పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఒక ఇంట్లో వ్యక్తికి కరోనా సోకితే, ఆ వ్యక్తి వారం పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి. ఆ వ్యక్తితో పాటు ఇంట్లో ఉండేవారు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సామాన్యులు కావొచ్చు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా కావొచ్చు. ప్రతి ఒక్కరూ ఫాలో కావాల్సందే. అయితే, స్వయానా ముఖ్యమంత్రి సోదరుడు ఆ రూల్స్‌ను బ్రేక్ చేసి బయట తిరుగుతుండటంతో విమర్శలు వస్తున్నాయి.
Read: వాండరర్స్ టెస్ట్: భారత్‌పై సౌతాఫ్రికా ఘనవిజయం…
దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోదరుడిని మందలించింది. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే ఇంటి నుంచి బయటకు ఎలా వెళ్తావని ప్రశ్నించింది. బయటకు వెళ్లేందుకు వీలులేదని స్పష్టం చేసింది. మమతా బెనర్జీ సోదరుడి భార్యకు కరోనా సోకడంతో ఆమెతో పాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. వారం పూర్తైన తరువాత కూడా తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉంటానని చెప్పారు. బెంగాల్లో గత కొన్ని రోజులుగా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.
