Site icon NTV Telugu

కేర‌ళ‌లో దీదీ పోస్ట‌ర్లు… వైర‌ల్‌…

బెంగాల్‌లో మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన మ‌మ‌తా బెన‌ర్జీకి దేశ‌వ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోతున్న‌ది.  దేశంలోని అన్ని అన్నిరాష్ట్రాల్లో పార్టీని విస్త‌రించాల‌నే అలోచ‌నలో దీదీ ఉన్న‌ట్టు స‌మాచారం.  దానికి ఇదే సాక్ష్యం అని చెప్పొచ్చు.  కేర‌ళ‌లో దీదీని పిల‌వండి… దేశాన్ని కాపాడండి…ఛ‌లో ఢిల్లి… పేరుతో పోస్ట‌ర్లు వెలిశాయి.  కేర‌ళ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఈ పోస్ట‌ర్లు వెల‌వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  34 ఏళ్లు ఏక‌చ‌క్రాధిప‌త్యంగా బెంగాల్‌ను శాశించిన వామ‌ప‌క్షాల కోట‌ను బ‌ద్ద‌లుకొట్టి 2011లో దీదీ అధికారంలోకి వ‌చ్చింది.  అప్ప‌టి నుంచి బెంగాల్‌లో దీదీ హ‌వా కొన‌సాగుతోంది.  ఎలాగైన అధికారంలోకి రావాల‌ని చూసిన బీజేపీకి మ‌మ‌తా షాక్ ఇచ్చింది.  వామప‌క్షాలు తుడుచుకుపోయాయి.  దీంతో దేశంలో బీజేపీని ఎదుర్కొనే ద‌మ్మున్న నేత దీదీ అనే నమ్మ‌కం అందిలోనూ క‌లుగుతున్నది.  కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో సామాన్య ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో కేంద్రం లోని బీజేపీని గద్దె దించాలంటే త‌ప్ప‌ని స‌రిగా మోడీ లాంటి బ‌ల‌మైన నాయ‌కుడు కావాలి.  అలాంటి బ‌ల‌మైన, చ‌రిష్మాక‌లిగిన నేత దీదీ అని కొంద‌రి అభిప్రాయం.  ప్ర‌స్తుతం కేర‌ళ‌లో వెలిసిన ఈ పోస్ట‌ర్లు వైర‌ల్ అవుతున్నాయి.  

Read: లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పై కేసు నమోదు

Exit mobile version