Site icon NTV Telugu

Mamata Banerjee: ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ

Mamata Banerjee Meets Pm Modi

Mamata Banerjee Meets Pm Modi

CM Mamata Banerjee Meets PM Narendra Modi in Delhi: ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని వివర్శించే బెంగాల్ సీఎం, త్రుణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో ఆయన్ను కలిశారు మమతాబెనర్జీ. బెంగాల్ రాష్ట్రంలో సమస్యలను, జీఎస్టీ బకాయిల విడుదలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు మమతా బెనర్జీ. నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం ఢిల్లీ వచ్చిన దీదీ, శుక్రవారం రోజు ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశం తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

దీంతో పాటు ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి మమతా హాజరవనున్నట్లు తెలిసింది. గతేడాది జరిగిన మీటింగ్ లో మమతా బెనర్జీ పాల్గొనలేదు. గురువారం రోజూ త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం అయిన మమతా బెనర్జీ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు. ఈ మేరకు ప్రజా సమస్యలు, బెంగాల్ సమస్యలపై పోరాడాలని ఎంపీలకు దిశానిర్థేశం చేశారు. దీంతో పాటు అత్యంత కీలమైన 2024 పార్లమెంట్ ఎన్నికలపై కూడా మమతా బెనర్జీ టీఎంసీ ఎంపీలతోె చర్చించారు.

Read Also: Komatireddy Rajgopal Reddy : అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నా..

ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందు ప్రధాని మోదీని, మమతా బెనర్జీ కలవడం చర్చనీయాంశం అయింది. బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్ కర్ ను ఎన్డీయే తన ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. మార్గరేట్ ఆల్వాను ప్రతిపక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నియమించాయి. గవర్నర్ గా ఉన్న సమయంలో జగదీప్ ధన్ కర్, సీఎం మమతా బెనర్జీ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అయితే గతంలో స్వయంగా టీఎంసీ ప్రతిపాదించిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ప్రకటించింది. అయితే ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము చేతిలో ఘోర పరాజయం చూసిన సంగతి తెలిసిందే. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీఎంసీ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో చూడాలి.

Exit mobile version