NTV Telugu Site icon

ప్ర‌ధాని మోడీకి దీదీ కీల‌క సూచ‌న‌…

బెంగాల్ సీఎంగా మూడోసారి ఎంపిక‌య్యాక మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీ ప‌ర్య‌ట‌కు వెళ్లారు.  ఢిల్లీలో ప్ర‌ధాని మోడితో స‌హా అనేక మంది నేత‌ల‌తో దీదీ భేటీ కాబోతున్నారు.  కొద్ది సేప‌టి క్రిత‌మే బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు.  రాష్ట్రానికి రావాల్సిన వ‌ర‌ద సాయం, వ్యాక్సిన్ డోసులు, రాష్ట్రం పేరు మార్పు త‌దిత‌ర విష‌యాల‌పై ఆమె ప్ర‌ధానితో చ‌ర్చించారు.  ప్ర‌స్తుతం దేశాన్ని పెగాస‌స్ స్పేవేర్ అంశం కుదిపేస్తున్న‌ది.  దీనిపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌టికే ప‌ట్టుబ‌డుతున్నాయి.  హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు ఇప్ప‌టికే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.  అయితే, కేంద్రం మాత్రం పెగాస‌స్ విష‌యంలో ఎలాంటి త‌ప్పులు చేయ‌లేద‌ని కొట్టిపారేసింది.  దీంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ర‌గ‌డ చేస్తున్నాయి. పెగాస‌స్ వ్య‌వ‌హారంపై అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాలు చేయాల‌ని ప్ర‌ధానికి మోడీకి దీదీ సూచించారు. 

Read: సినిమా థియేటర్ల టిక్కెట్ల ధరల పై టీఎస్ హైకోర్టులో విచారణ