NTV Telugu Site icon

Anant Ambani Wedding: పెళ్లి కోసం ముంబై వెళ్తున్న బెంగాల్ సీఎం మమత

Mukesh

Mukesh

ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జూలై 12, అనగా శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ముంబైలోని పెళ్లి వేదికను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే కొద్ది రోజుల నుంచి పెళ్లి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇక శుక్రవారం నుంచి ఆదివారం వరకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇక ఈ వివాహానికి స్వదేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి అతిరథ మహరథులు రానున్నారు. ప్రముఖ కంపెనీల సీఈవోలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

అయితే ఈ వివాహానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతున్నారు. ఈ మేరకు ఆమె తెలియజేశారు. ముఖేష్ అంబానీ-నీతా అంబానీ పిలుపు మేరకు.. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం గురువారం బయలుదేరి వెళ్తున్నట్లు ఈ మేరకు ఆమె మీడియాతో వెల్లడించారు.

ఇదిలా ఉంటే ముంబై పర్యటనలో భాగంగా.. ఈ వివాహం కోసం ఇండియా కూటమి నేతలు కూడా రానున్నారు. పనిలో పనిగా ముంబైలో ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఇండియా నేతలు అనుసరించాల్సిన విధానంపై చర్చించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.