Mamata Banerjee: ఎలక్షన్ షెడ్యూల్‌ ముందు.. హిందూ, ముస్లిం ఓట్ల కోసం మమతా కీలక నిర్ణయం..

  • ఎన్నికల షెడ్యూల్ మందు మమతా బెనర్జీ కీలక నిర్ణయం.. పురోహితులు, ముజ్జిన్‌‌ల గౌరవవేతనం పెంపు..
Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: కేంద్రం ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 4 గంటలకు నాలుగు రాష్ట్రాలు- తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం-పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. అయితే, ఎన్నికల షెడ్యూల్ వచ్చే కొన్ని గంటల ముందు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read Also: Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఐదు అసెంబ్లీల పదవీకాలం మే నెలలో ముగుస్తుంది. షెడ్యూల్ తర్వాత ఆయా రాష్ట్రాలు, యూటీలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఈలోపే హిందూ, ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంగా మమతా బెనర్జీ ఆలయాల పూజారులు, ముజ్జిన్‌లకు చెల్లించే నెలవారీ గౌరవవేతాన్ని రూ. 500లకు పెంచినట్లు ప్రకటించారు. ‘‘మా పూజారులు, ముజ్జిన్‌లకు చెల్లించే నెలవారీ గౌరవ వేతనాన్ని రూ. 500 పెంచినట్లు ప్రకటించడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారి సేవ మన సమాజాల ఆధ్యాత్మిక మరియు సామాజిక జీవితాన్ని నిలబెట్టింది. ఈ సవరణతో, వారు ఇప్పుడు నెలకు రూ.2,000 అందుకుంటారు’’ అని ఆమె ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో పురోహితులు, ముజ్జిన్‌లు సక్రమంగా సమర్పించిన అన్ని కొత్త దరఖాస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్లు ఆమె ప్రకటించారు. సమాజాంలో మతపరమైన కార్యకర్తల్ని పోషించే పాత్రను గుర్తించడం ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రతీ సమాజంలో, ప్రతీ సంప్రదాయాన్ని విలువైనదిగా, బలోపేతం చేసే వాతావరణాన్ని పెంపొందించడంలో మేము గర్విస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే కొద్ది గంటల ముందు ఆమె ఈ ప్రకటన చేయడాన్ని ప్రతిపక్షాలు ఓటర్లను ఆకట్టుకునే ట్రిక్‌గా విమర్శి్స్తున్నారు.