Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Mamata Banerjee Declares War On Bjp Opposition Unity Bengal Politics

Mamata Banerjee: “నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు”.. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ

Published Date :May 9, 2026 , 9:23 pm
By Shiva Ganesh
Mamata Banerjee: “నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు”.. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రవీంద్రనాథ్ ఠాగోర్ జయంతిని పురస్కరించుకుని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బీజేపీ నియంతృత్వ పోకడలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఠాగోర్ జయంతి వేడుకల నిర్వహణలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మమత ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాళీఘాట్ కూడలి, ముక్తదల్ వంటి ప్రాంతాల్లో వేడుకలకు అనుమతి కోరగా అధికారులు నిరాకరించారని ఆమె ఆరోపించారు. “ఇది టీఎంసీ గొంతు నొక్కే ప్రయత్నం. అందుకే పార్టీ కార్యాలయం బయటే జయంతిని నిర్వహిస్తున్నాం. మాతృభూమిని ప్రేమించే వారు భయం లేకుండా ఏకమవ్వాలి” అని ఆమె వ్యాఖ్యానించారు.

బెంగాల్‌లో భయంకర పాలన
రాష్ట్రంలో బీజేపీ వేధింపులు పెరిగిపోయాయని, దళితులు, మహిళలను కూడా వదలడం లేదని మమత ఆరోపించారు. తనతో ఉండే 92 ఏళ్ల వృద్ధురాలు వేధింపుల భయంతో ఇల్లు వదలాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన వధువులను కూడా ఇంటి నుంచి పంపిస్తున్నారని, పార్టీ కార్యకర్తల ఇళ్ల వద్ద గూండాయిజం జరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేబ్ భట్టాచార్య భద్రత విషయంలో బీజేపీ తీరును ఆమె తప్పుబట్టారు. “నేను అధికారంలోకి వచ్చినప్పుడు బుద్ధదేబ్‌కు గౌరవం ఇచ్చాను, నా సొంత బుల్లెట్‌ప్రూఫ్ కారును ఆయన కోసం పంపాను. కానీ బీజేపీ అధికారంలోకి రాగానే ఆయనకు ఉన్న జెడ్ ప్లస్ సెక్యూరిటీని, ఇతర సేవలను తొలగించింది” అని ఆమె గుర్తు చేశారు.

Also Read

  • Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
  • TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!
  • Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం
  • Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
Add as a preferred
source on google

బీజేపీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో జాతీయ స్థాయి నాయకులంతా తనతో ఉన్నారని మమత స్పష్టం చేశారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ వంటి నేతలతో మాట్లాడినట్లు ఆమె వెల్లడించారు. కపిల్ సిబల్ వంటి సీనియర్ న్యాయవాదులు కూడా మద్దతు ప్రకటించారని, తానే స్వయంగా న్యాయవాదిగా ఈ యుద్ధంలో ముందుంటానని పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఢిల్లీ వెళ్తుండగా విమానాశ్రయంలో వేధింపులకు గురయ్యారని మమత వెల్లడించారు. ఎన్నికల రిగ్గింగ్‌కు పాల్పడిన వారే ఆమెను వేధించారని, దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ రాజకీయ, నైతిక పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా దీదీ స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Breakingnews
  • democracy
  • IndiaPolitics
  • MahuaMoitra

తాజావార్తలు

  • Mamata Banerjee: “నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు”.. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ

  • Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..

  • TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!

  • Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే

  • Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions