కోల్‌కతాలో నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లను బెంగాల్ ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే నాలుగు సార్లు మమత సర్కార్ చర్చలకు పిలిచింది. కానీ డాక్టర్లు మాత్రం చర్చలు నిరాకరించారు. దీంతో సోమవారం ఐదోసారి.. ఇదే చివరి ఆహ్వానం అంటూ జూడాలకు పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ చర్చలకు ఆహ్వానించారు. సాయంత్రం 5 గంటలకు కాళీఘాట్ నివాసంలో సమావేశానికి రావాలని డాక్టర్లను సీఎం మమత పిలిచారని మనోజ్ పంత్ స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న డాక్టర్లు ఓపెన్ మైండ్‌తో చర్చలకు రావాలని కోరారు.
ఇది కూడా చదవండి: Khairatabad Ganesh: ఖైరతాబాద్ వినాయకుడు వద్ద స్పీడ్ అందుకున్న కర్ర పనులు..
అయితే ఈ సమావేశానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ లేదా వీడియో రికార్డింగ్ అనుమతించబడదని మనోజ్ పంత్ స్పష్టం చేశారు. సమావేశం యొక్క మినిట్స్ మాత్రం రికార్డ్ చేయబడతాయని వెల్లడించారు. ఇరు పక్షాల నుంచి సంతకాలు చేయబడతామని స్పష్టం చేశారు. సమావేశాన్ని లైవ్ టెలీకాస్ట్ చేయాలంటూ డాక్టర్లు పట్టుబడుతున్నారు.. దీంతో భేటీపై ప్రతిష్టంభన నెలకొంది. కనీసం టీ తాగేందుకైనా రావాలని ప్రభుత్వం ఆహ్వానించినా రాలేదు. న్యాయం జరిగాకే టీ తాగుతామని డాక్టర్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైల్ పేరు మారింది.. ఇకపై ఇలా పిలవాలి..
సోమవారం చివరి ఆహ్వానం అంటూ బెంగాల్ ప్రభుత్వం డాక్టర్లను హెచ్చరించింది. మరీ ఈ సమావేశానికైనా జూడాలు వస్తారా? ఎప్పటిలాగానే మొండిపట్టుపడతారా? చూడాలి. ఇప్పటికే నెల రోజులకు పైగా డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. దీంతో రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఈ సమావేశానికి డాక్టర్లు రాకపోతే.. తదుపరి బెంగాల్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత క్రూరంగా హత్యాచారం జరిగింది. అనంతరం ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Jani Master: మతం మారాలని దాడి.. పార్శిల్ వార్నింగ్.. వెలుగులోకి సంచలనాలు!!!