మధ్యప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ కుల గణనను నిర్వహిస్తామనిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం తెలిపారు. మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న ఖర్గే.. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని సాగర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
Read Also: Shivoham: రాక్షసుడు డైరెక్టర్ శివోహం అంటున్నాడు…
మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఖర్గే తెలిపారు. మరోవైపు బుందేల్‌ఖండ్ ప్యాకేజీని బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని ఖర్గే దుయ్యబట్టారు. మరోవైపు మణిపూర్‌లో హింస, అల్లర్లు చెలరేగిన ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ చేయలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. షెడ్యూల్డ్ కులాలకు సెయింట్ రవిదాస్ రూ.100 కోట్ల స్మారక ఆలయానికి ఈ నెల ప్రారంభంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సాగర్‌లోని సెయింట్ రవిదాస్ ఆలయానికి పునాది వేశారు కానీ.. అతనిని ఢిల్లీలో విమర్శించారని తెలిపారు. ఎన్నికల సమయంలోనే ప్రధానికి సెయింట్ రవిదాస్ గుర్తుకొస్తున్నారని ఆరోపించారు.
Read Also: Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో ఆరోజు జాయిన్ కానున్న పవన్ కళ్యాణ్
2011 జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ లో దళితుల జనాభా 1.13 కోట్లు ఉంది. ఈశాన్య మధ్యప్రదేశ్ లోని బుందేల్‌ఖండ్‌లో ఆరు అసెంబ్లీ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 2018 రాష్ట్ర ఎన్నికలలో బినా, నార్యోలి, జాతర, చందాల మరియు హట్టా ఐదు స్థానాలను BJP గెలుచుకోగా.. కాంగ్రెస్ గన్నోర్‌ను మాత్రమే దక్కించుకుంది. మరోవైపు బుందేల్‌ఖండ్‌లో సాగర్, చత్తర్‌పూర్, తికమ్‌గఢ్, నిమారి, దామోహ్, పన్నా జిల్లాలు ఉన్నాయి. వీటిలో 26 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 15.. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజెపి గెలుచుకోగా, కాంగ్రెస్ 9, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి.
