NTV Telugu Site icon

Mallikarjun Kharge: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చుంటే వారంతా జైల్లో ఉండేవారు

Mallikarjunkharge

Mallikarjunkharge

బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంత్‌నాగ్‌లో ఖర్గే పర్యటించారు. ఈ సందర్భంగా కమలం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమకు మరో 20 సీట్లు వచ్చుంటే వారంతా జైల్లో ఉండేవారని వ్యాఖ్యానించారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయంటూ ప్రచారం చేసిన వారు ఎక్కడికి వెళ్లారు..? వారి సీట్లు 240కి పడిపోయాయన్నారు. అదే మాకు మరో 20 సీట్లు వచ్చి ఉంటే.. వారంతా జైలుకు వెళ్లేవారని ఖర్గే హెచ్చరించారు. వారంతా జైలుకెళ్లడానికి అర్హులు అని వ్యాఖ్యానించారు.

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ ఎమర్జెన్సీ ఆలోచనా ధోరణికి ఈ వ్యాఖ్యలు ఒక ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్లా పేర్కొన్నారు. ఇందిరాగాంధీ చేసినట్లుగా ప్రతిపక్షంలో ఉన్న నేతలను జైల్లో పెట్టాలన్నారు. ఇందిరాగాంధీ ఆ పనే చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తీరును కాంగ్రెస్‌ను కొనసాగించాలని అనుకుంటోందని చెప్పారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నియంతృత్వ వైఖరిని అనుసరిస్తుంటే వారు మాట్లాడరన్నారు. కానీ ఇతరులను మాత్రం నియంతృత్వ పార్టీలు అంటారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో షెహజాద్ పూనావాల్లా పేర్కొన్నారు.

జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లే వచ్చాయి. జేడీయూ, టీడీపీ మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

 

Show comments