NTV Telugu Site icon

Maldivian President Muizzu: ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లడం గౌరవంగా భావిస్తున్నాను..

Maldivian President Muizzu

Maldivian President Muizzu

Maldivian President Muizzu: ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి అధికారం నిలుపుకుంది. ఈ ప్రమాణస్వీకార వేడుకులకు ఇండియా ఇరుగుపొరుగు దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్, సీషెల్స్ ఇలా పలు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత సంబంధాలు మరింత బలపడేందుకు ఈ కార్యక్రమం వేదిక కాబోతోంది.

Read Also: AIADMK: బీజేపీతో పొత్తు ఉండదు.. తేల్చి చెప్పిన పళనిస్వామి..

ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ కూడా రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం తనకు గౌరవంగా భావిస్తున్నాని, చారిత్రాత్మక ఘట్టం కోసం ఆయన తొలిసారిగా భారత్‌లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలు ‘సానుకూల దిశ’లో సాగుతున్నాయని నిరూపిస్తుందని శనివారం ముయిజ్జూ అన్నారు. భారత ఆహ్వానాన్ని ప్రెసిడెంట్ ముయిజ్జూ అంగీకరించిన తర్వాత ఆ వ్యాఖ్యలు చేశారు.

గతేడాది నవంబర్ 17న పదవీ బాధ్యతలు చేపట్టిన ముయిజ్జై భారత వ్యతిరేక, చైనా అనుకూల విధానాలతో వార్తల్లో ఉంటున్నాడు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను తమ దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడు. ఇదే కాకుండా ఈ ఏడాది ప్రధాని లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ముయిజ్జూ కేబినెట్ మంత్రులు, ప్రధానిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదమైంది. అప్పటి నుంచి భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ ద్వీపదేశం సాయం కోసం భారత్‌ని అభ్యర్థించడం మొదలుపెట్టింది.