NTV Telugu Site icon

Maldives: చైనాలో మాల్దీవుల ఒప్పందం.. భారత అధికారులు వెళ్లిపోవాలని ఆదేశం..

Maldives

Maldives

Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మరోసారి భారత్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. మే 10 తర్వాత భారత సైనిక సిబ్బంది, పౌర దుస్తుల్లో ఉన్న వారు కూడా తమ దేశంలో ఉండరాదని హెచ్చరించారు. మాల్దీవుల్లో భారత సైనిక సిబ్బందిని , పౌర సిబ్బంది మాల్దీవులకు చేరుకున్న వారంలోపే ముయిజ్జూ నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత సైనిక సిబ్బంది మాల్దీవుల నుంచి ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మార్చి 10 లోగా ఈ ప్రక్రియ మొదటిదశ ప్రారంభించనున్నారు. అయితే, తాజాగా ముయిజ్జూ ఈ తేదీ కన్నా ముందుగానే ప్రకటన చేయడం గమనార్హం.

Read Also: CM Revanth Reddy : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు

భారతదేశ సైనికులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు తమ ప్రభుత్వం విజయం సాధించినందుకు, తప్పుడు పుకార్లను వ్యాప్తి చేసే వ్యక్తులు పరిస్థితిని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ముయిజ్జై బా అటోల్ ఎయిదాఫుషి ప్రాంతంలోని ప్రజలను ఉద్దేశించి అన్నట్టుగా అక్కడి మీడియా నివేదించింది. మే 10వ తేదీన భారత సైనికులు ఉండరు, భారత సైన్యం ఈ దేశంలో ఏ దుస్తుల్లో కూడా నివసించదు, ఈ విషయాన్ని తాను విశ్వాసంతో చెబుతున్నానని, చైనాతో ఉచిత సైనిక సహాయ ఒప్పందంపై సంతరం చేసిన ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.

గత నెల ప్రారంభంలో ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఇరు పక్షాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత, మాల్దీవుల్లో మూడు విమాన ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహిస్తున్న తమ సైనిక సిబ్బందిని మే 10 నాటికి భారత్ భర్తీ చేస్తుందని, మొదటి దశ ప్రక్రియ మార్చి 10 నాటికి పూర్తి చేయాలని మాల్దీవుల విదేశాంగ శాఖ తెలిపింది. అక్కడి ప్రజలకు మానవతా సేవలను అందించేందుకు 88 మంది సైనిక సిబ్బంది మాల్దీవుల్లో ఉన్నారు. భారత వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనాకు దగ్గరవుతున్నాడు. భారత దేశానికి 300 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాల్దీవుల్లో చైనా తిష్ట వేయడం భారత్‌కి ప్రమాదకరంగా భావిస్తోంది.