Director Ranjith: హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. దర్శకుడు రంజిత్ అరెస్ట్

  • హీరోయిన్‌పై లైంగిక వేధింపులు
  • ప్రముఖ దర్శకుడు రంజిత్ అరెస్ట్
  • సినిమా లొకేషన్‌లో లైంగిక దాడి చేయబోయాడని ఫిర్యాదు
Arrest

Arrest

ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యువ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్శకుడు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఒక సినిమా లొకేషన్‌లో తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తొడుపుళ్ల పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దర్శకుడు రంజిత్‌ను అరెస్ట్ చేశారు. ఇడుక్కి ఎస్పీ ఆదేశాల మేరకు తొడుపుళ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎర్నాకులం సబ్-కోర్టు ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది.

ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన

×
×
Ad

దర్శకుడు రంజిత్ అనుచిత ప్రవర్తనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆయనపై ఫిర్యాదులు చేశారు. గతంలో బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తనతో డైరెక్టర్ రంజిత్ అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేరళ ఫిల్మ్ అకాడమీకి రంజిత్ రాజీనామా చేశాడు.