Site icon NTV Telugu

Delhi: ఢిల్లీ ఎంపీల నివాసంలో భారీ అగ్నిప్రమాదం

Delhifire

Delhifire

దేశ రాజధాని ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఎంత నష్టం జరిగింది. ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Gold Sweets: జైపూర్‌లో ఆకట్టుకుంటున్న బంగారం స్వీట్స్.. ధరెంతో తెలుసా!

ఢిల్లీలోని బీడీ మార్గ్‌లోని బహుళ అంతస్తుల బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. 2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ భవనంలో అనేక మంది రాజ్యసభ ఎంపీలు ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. కాంప్లెక్స్‌లోని పై అంతస్తులో ఒకదాంట్లో మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పార్లమెంట్ నుంచి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ నివాస సముదాయం ఉంది. పార్లమెంట్ సభ్యులకు కేటాయించిన అధికారిక నివాసాల్లో బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్ ఒకటి.

 

Exit mobile version