ప్రముఖ జనపద గాయని మైథిలి ఠాకూర్ అలీనగర్ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అలీనగర్ ప్రజల ఆశీస్సులు తనకు స్ఫూర్తి ఇచ్చాయని.. వారి ఆశీస్సులతో విజయం సాధిస్తానని మైథిలి ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు.
అలీనగర్ ప్రజలకు సేవ చేసేందుకు.. అభివృద్ధి, సంక్షేమం కోసం సంకల్పంతో పూర్తి శక్తితో పని చేస్తూ ఉంటానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలీ నగర్ ప్రజలకు సేవ చేయడానికి ఎన్డీఏ లక్ష్యాలు, ప్రజా సంక్షేమ విధానాలను ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి తీసుకెళ్లడానికి పూర్తి అంకితభావం, నిబద్ధతతో పని చేస్తూనే ఉంటాననని చెప్పుకొచ్చారు.
మైథిలి ఠాకూర్..
మైథిలి ఠాకూర్ 25 జూలై 2000లో జన్మించింది. రమేష్-భారతీ దంపతులకు జన్మించింది. భారతీయ శాస్త్రీయ సంగీత, జానపద సంగీతంలో శిక్షణ పొందింది. హిందీ, బెంగాలీ, ఉర్దూ, మరాఠీ, భోజ్పురి, పంజాబీ, తమిళం, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో పాడింది. 2024లో మైథిలి ఠాకూర్‌కు ‘‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది.
ఇది కూడా చదవండి: Pakistan-Afghan War: పాకిస్థాన్ వైమానిక దాడి.. ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సహా 8 మంది మృతి
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. ఇండియా కూటమి మాత్రం చివరి నిమిషంలో విభేదాలు కారణంగా విడివిడిగా పోటీ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Naga Chaitanya : 9వ క్లాస్ లోనే అమ్మాయికి ముద్దు ఇచ్చా.. నాగచైతన్య మామూలోడు కాదుగా..
