Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో ఏకంగా 65.1 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. 1995 ఎన్నికల్లో 71.5 శాతం నమోదైంది. ఆ తర్వాత ఇప్పుడే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. దశాబ్ధం తర్వాత ఇంతలా ఓటింగ్ శాతం పెరగడం ఇదే తొలిసారి.
Read Also: President Droupadi Murmu: కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది: రాష్ట్రపతి
2004, 2014 ఎన్నికల్లో 63.4 శాతం ఓటింగ్ నమోదైంది. 1995లో అత్యధికంగా 71.5 శాతం ఉన్న పోలింగ్ శాతం, 1999లో 61కి పడిపోయింది. 2009లో 59.7 శాతంగా నమోదైంది. 2014లో 63.4 శాతానికి చేరుకుంది. 2019లో 61.4 శాతంగా నమోదైంది. నిజానికి అధిక ఓటింగ్ అనేది అధికారంలో ఉన్న వారికి ప్రమాదం అని సూచిస్తారు, అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ బీజేపీ కూటమికి దెబ్బపడింది. అన్ని సందర్భాల్లో ఓటింగ్ శాతం అనేది కీలకం కాబోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మహారాష్ట్రలో నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలో అత్యధికంగా 70 శాతం ఓటింగ్ నమోదైంది. రాజధాని ముంబైలో మాత్రం కేవలం 54 శాతం మాత్రమే నమోదైంది. 2019తో పోలిస్తే(50.67) శాతం కన్నా ఎక్కువగానే ఓట్లేశారు. అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఓటేయకపోవడం గమనార్హం. ముంబైలోని కలాబా సీటులో కేవలం 44.5 శాతం మాత్రమే ఓటింగ్ నమైదైంది. ముంబైలోని సబర్బన్‌లో 39.34 శాతం పోలింగ్ నమోదైంది. 46 స్థానాలున్న మరఠ్వాడా రీజియన్‌లో 20 స్థానాల్లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. ఈ 20 స్థానాల్లో 17 మంది బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు.