Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Maharashtra Woman Throws Baby Off Running Bus

Maharashtra: మాతృత్వానికి మాయని మచ్చ.. మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి

Published Date :July 16, 2025 , 11:42 am
By Suresh Maddala
  • మహారాష్ట్రలో అమానుష ఘటన
  • మాతృత్వానికి మాయని మచ్చ
  • మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి
Maharashtra: మాతృత్వానికి మాయని మచ్చ.. మగబిడ్డను కని బస్సులోంచి విసిరేసిన తల్లి
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మాతృత్వానికే మాయని మచ్చగా మిగిలే ఘోర అమానుష సంఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణం చేస్తున్న గర్భవతికి అకస్మాత్తుగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే మగబిడ్డకు జన్మినిచ్చింది. అనంతరం ఒక గుడ్డలో చుట్టి బస్సులోంచి విసిరేసింది. డ్రైవర్ అద్దంలోంచి చూడడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Pahalgam Attack: 26 మందిని చంపాక 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు.. ముష్కరులు ఇలా ఎందుకు చేశారంటే..!

రితికా ధేరే(19) అనే యువతి, భర్త అని చెప్పుకునే అల్తాఫ్ షేక్‌తో కలిసి సంత్ ప్రయాగ్ ట్రావెల్స్‌లో స్లీపర్ కోచ్‌ బస్సులో పూణె నుంచి పర్భానీకి వెళ్తున్నారు. రితికా గర్భవతిగా ఉంది. ఉన్నట్టుండి రితికాకు నొప్పులు ప్రారంభం అయ్యాయి. ప్రసవ వేదనకు గురైన ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శిశువును ఒక గుడ్డ ముక్కలో చుట్టి బస్సులోంచి విసిరేశారు. అయితే బస్సులో ఎగువ, దిగువ బెర్తులు ఉన్నాయి. అయితే  కిటికీలోంచి ఏదో విసిరేసినట్లుగా డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సు ఆపి ఆరా తీయగా.. ప్రయాణం కారణంగా భార్యకు వాంతులు అయ్యాయని భర్త షేక్ చెప్పాడు. అయితే రోడ్డుపై స్థానికుడు ఉండడంతో బస్సులోంచి ఏదో పడినట్లుగా గమనించాడు. వెంటనే వెళ్లి చూడగా మగ శిశువు అని తెలుసుకుని షాక్ అయ్యాడు. వెంటనే 112 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పోలీసులను అప్రమత్తం చేశాడు.

ఇది కూడా చదవండి: Phone Tapping: నేడు మరోసారి సిట్‌ ముందుకు ప్రభాకర్‌రావు..

పెట్రోలింగ్ విధుల్లో ఉన్న స్థానిక పోలీసుల బృందం బస్సును అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసి ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన తర్వాత రితికా, షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా బిడ్డను పెంచలేకపోవడంతోనే శిశువును విసిరేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే శిశువును రోడ్డుపై పడేయడంతో చనిపోయినట్లుగా పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రితికా, షేక్ ఇద్దరూ పర్భానీకి చెందినవారని.. గత ఒకటిన్నర సంవత్సరాలుగా పూణేలో నివసిస్తున్నారని చెప్పారు. భార్యాభర్తలుగా చెలామణి అవుతున్నారని.. అందుకు వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఎలాంటి పత్రాలు కూడా చూపించలేదని పోలీస్ అధికారి చెప్పారు. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పత్రి-సేలు రోడ్డులో జరిగిందని.. స్థానిక పౌరుడి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లుగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad: మలక్‌పేట్ కాల్పులపై కొనసాగుతున్న దర్యాప్తు.. నిందితులు ఏం చేశారంటే..!

రితికా, షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. పర్భానీలోని పత్రి పోలీస్ స్టేషన్‌లో జంటపై BNS సెక్షన్ 94 (3), (5) (మృతదేహాన్ని రహస్యంగా పారవేయడం ద్వారా జననాన్ని దాచిపెట్టడం) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులకు నోటీసులు అందజేశామని.. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Maharashtra woman
  • Parbhani
  • running bus
  • Throws baby
  • Woman delivers

తాజావార్తలు

  • Tina Ambani: అంబానీ కుటుంబంలో విషాదం.. కన్నీళ్లు పెట్టుకున్న టీనా అంబానీ

  • Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

  • SDT 19: మెగా మేనల్లుడితో ‘క’ డైరెక్టర్స్ క్రేజీ ప్రాజెక్ట్.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూశారా

  • Exclusive : రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న రిలీజ్ ఫిక్స్.. బుకింగ్స్ ఓపెన్

  • Pakistan Crisis: లీటర్ పెట్రోల్ 458, కిలో టమోటా 250.. ఒక్క నెలలోనే రూ. 900 పెరిగిన గ్యాస్ సిలిండర్!

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions