Site icon NTV Telugu

Maharashtra: హలోకు బదులు “వందేమాతరం”.. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రచారం

Maharashtra

Maharashtra

Vande Mataram Instead Of Hello In New Campaign:మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. ఫోన్ కాల్స్ స్వీకరించేటప్పుడు ఇకపై హలోకు బదులుగా ‘వందేమాతరం’ చెప్పాలని ప్రజలకు మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ప్రచారాన్ని ప్రారంభించింది. వందేమాతరం అంటే.. మా అమ్మకు ముందు నమస్కరిస్తున్నామని అర్థం అని.. అందుకే ప్రజల్ని హలోకు బదులు వందేమాతరం చెప్పాలని కోరుతున్నామని సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ అన్నారు. వార్థాలో జరిగిన మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వందేమాతరం ప్రచారాన్ని ప్రారంభించారు.

Read Also: climbed Tirumala Steps with his wife: భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన సత్తిబాబు

దీనిపై మహా సర్కార్ ప్రభుత్వ రిజల్యూషన్(జీఆర్)ను జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అధికారిక, వ్యక్తిగత ఫోన్ కాల్ స్వీకరించే సమయంలో హలోకు బదులు వందేమాతరం పలకాలని స్పష్టం చేసింది. అయితే ఇది తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని.. హెచ్ఓడీలు తమ ఉద్యోగులు ఇలా పలకరించేలా ప్రోత్సహించాలని కోరింది. హలో అనేది పాశ్చాత్య సంస్కృతి అని.. ఈ పదానికి నిర్ధిష్ట అర్థం లేదని.. ఈ పదం లాంఛనప్రాయమే అని ప్రభుత్వం చెబుతోంది. వందేమాతరం పలకడం వల్ల ఆప్యాయత భావాన్ని పెంపొందుతుందని.. దీనిపై అవగాహన కల్పించేందుకు సిద్ధం అయింది మహారాష్ట్ర ప్రభుత్వం.

మంత్రి సుధీర్ మునిగంటివార్ మాట్లాడుతూ.. ప్రజలు ‘‘జై భీమ్’’, ‘‘జై శ్రీరాం’’ అని చెప్పాలనుకున్నా, ఫోన్ కాల్ కు సమాధానం ఇచ్చేటప్పుడు వారి తల్లిదండ్రుల పేర్లను ప్రస్తావించాలని అనుకున్నా అభ్యంతరం ఏం లేదని అన్నారు. కాల్స్ స్వీకరించేటప్పుడు హలో చెప్పకూడదన్నదే మా అభిమతం అని ఆయన అన్నారు. స్వాతంత్య్రోద్యమం కాలంలో ‘ ఇంక్విలాబ్ జిందాబాాద్’ అనే పదాన్ని బ్రిటీష్ వారు నిషేధించారని.. అయివతే అదే ఎంతో మంది ఉద్యమంలో పాల్గొనేలా చేసిందన్నారు. మహత్మా గాంధీ కూడా వందేమాతరాన్ని సమర్థించారని ఆయన అన్నారు.

Exit mobile version