Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి

  • మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో విషాద ఘటన
  • ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కొడుకును కాపాడబోయి తండ్రి, తల్లి మృతి.
  • కొండ అంచుపై నుంచి పడిన తండ్రి, కుమారుడు..
  • ఇది చూసి తల్లి కూడా కొండపై నుంచి దూకి మృతి..
Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొడుకును కాపాడే క్రమంలో తల్లి, ఇది చూసిన తల్లి ముగ్గురూ మరణించారు. కొండ అంచున నిలబడి ఆత్మహత్య చేసుకుంటానని కొండపైకి వెళ్లిన 18 ఏళ్ల కునాల్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన అతడి తండ్రి మురళీధర్ చాంద్‌గుడే ప్రాణాలు కోల్పోగా.. కొద్దిసేపటికే తల్లి సంగీత కూడా కొండపై నుంచి పడిపోయి మృతి చెందారు. దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఖవ్డా హిల్ వద్ద శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం.. కునాల్ ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే దాని ఈఎంఐలు చెల్లించేందుకు కుటుంబ సభ్యులను డబ్బులు అడుగుతున్నాడు. తాజా ఈఎంఐ చెల్లింపు విషయంలో తండ్రితో కునాల్‌కు వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

దేవ్లాయ్‌ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఉదయం 10 గంటలకు కొండ అంచుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాదాపు 3 గంటల పాటు యువకుడిని గ్రామస్తులు, బంధువులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తన భవిష్యత్తు, అమ్మానాన్నల గురించి ఆలోచించాలని కోరారు. అయినప్పటికీ యువకుడు కొండ అంచుపై నుంచి కదలలేదు. చివరకు 15-20 నిమిషాల్లో తండ్రి కొండపైకి ఎక్కి కొడుకును వెనక్కి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు కొండ అంచు నుంచి జారిపడి మరణించారు. తీవ్ర ఆందోళనకు గురైన తల్లి కూడా కొండ పై నుంచి నుంచి పడిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురూ మరణించారు.

ఘటనా స్థలంలో గ్రామస్తులతో పాటు పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యువకుడికి నచ్చ చెప్పి, కొండ నుంచి దిగేలా ప్రయత్నించారు. చివరకు ఎవరి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. తల్లిదండ్రులు, ఇతరులు యువకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారని, అయినప్పటికీ అతనున వారి మాట వినకుండా కొండ అంచునే నిలబడ్డాడని చెప్పారు. తల్లి కూడా తన కొడుకును కొండ అంచు నుంచి రావాలని పదే పదే వేడుకున్నట్లు తెలిపారు.