Site icon NTV Telugu

Military Basic Training: ఇకపై ఆ రాష్ట్రంలో ఫస్ట్ క్లాస్ నుంచే బేసిక్‌ మిలిటరీ శిక్షణ..

Mh

Mh

Military Basic Training: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం లాంటి సద్గుణాలు పెంపొందించడానికి బేసిక్‌ మిలిటరీ శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ దాదా భూసే పేర్కొన్నారు. దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై వారికి సరైన అవగాహన ఉంటుందని అన్నారు. ఇందుకోసం స్టూడెంట్స్ కు మాజీ ఆర్మీ సిబ్బందితో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మాజీ సైనికులు విద్యార్థులకు బేసిక్ శిక్షణ ఇస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంతో స్టూడెంట్స్ కి దేశం పట్ల ప్రేమ పెరుగుతుందని కామెంట్స్ చేశారు.

Read Also: Netanyahu: ఢిల్లీలో నెతన్యాహు వాంటెడ్ పోస్టర్లు.. కేంద్రం అప్రమత్తం

అయితే, ఈ ప్రతిపాదనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం సానుకూలంగా స్పందించారని విద్యాశాఖ మంత్రి దాదా భూసే తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి క్రీడా ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ, స్కౌట్స్, గైడ్స్‌తో పాటు 2.5 లక్షల మంది రిటైర్డ్‌ సైనికుల సహాయం తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 22వ తేదీన జమ్ముకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి చెప్పుకొచ్చారు.

Exit mobile version