NTV Telugu Site icon

Border Dispute: మహారాష్ట్రలో హాలు.. తెలంగాణలో వంటిల్లు.. 14 గ్రామాల విచిత్ర పరిస్థితి

Border Dispute

Border Dispute

Maharashtra-Telangana border issue: ఇటీవల కర్ణాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం రాజుకుంటోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 14 గ్రామాల పరిస్థితి విచిత్రంగా ఉంది. తెలంగాణ సరిహద్దు మహారాష్ట్ర జిల్లా అయిన చంద్రపూర్ లోని మారుమూల జివటీ తాసీల్ పరిధిలో ఉన్నాయి. భౌగోళికంగా ఈ గ్రామాలు మహారాష్ట్రలో ఉన్నప్పటికీ.. తెలంగాణపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పథకాలు ఈ గ్రామాల్లోను వర్తిస్తున్నాయి. ఇక రెండు రాష్ట్రాల ఓటర్ జాబితాలో కూడా ఈ గ్రామాల ప్రజలు పేర్లు ఉన్నాయి. ఇలా రెండు గుర్తింపులతో జీవిస్తున్నారు ఇక్కడి ప్రజలు.

ఈ చిన్న సంఘటన చాలు సరిహద్దులో సమస్య ఎలా ఉందనేది తెలిపేందుకు. చంద్రపూర్ జిల్లాలోని మహారాజ్ గూడ గ్రామంలో ఉత్తమ్ పవర్, చందు పవార్ అన్నతమ్ములు. కుటుంబం అంతా ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. అయితే ఈ ఇళ్లు మాత్రం రెండు రాష్ట్రాల పరిధిలోకి వస్తుండటం విశేషం. ఒకే ఇంటిలో హాలు మహారాష్ట్రలో ఉంటే.. వంటిల్లు మాత్రం తెలంగాణలో ఉంది. మొత్తం 10 గదులు ఉంటే ఇంటిలో నాలుగు గదులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే.. మహారాష్ట్రలో మరో నాలుగు గదులు ఉన్నాయి.

Read Also: High BP: హై బీపీతో పెరుగుతున్న “డిమెన్షియా” ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి

‘‘1969లో సరిహద్దు సర్వే చేసినప్పుడు, మా ఇంట్లో సగం మహారాష్ట్రలో, మిగిలిన సగం తెలంగాణలో ఉందని చెప్పారు. మేము ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదు. మేము రెండు రాష్ట్రాల గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లిస్తున్నాము , తెలంగాణ ప్రభుత్వ పథకాల క్రింద మరిన్ని ప్రయోజనాలను పొందుతున్నాము’’ అని ఉత్తమ్ పవార్ చెబుతున్నారు.

అయితే ఈ సరిహద్దు సమస్యతో గ్రామాలు నిర్లక్ష్యానికి గురవుతున్నయనే వాదన కూడా ఉంది. అక్కడి ప్రజలు మహారాష్ట్ర కన్నా తెలంగాణ పథకాలే తమకు ఎక్కువగా వర్తిస్తున్నాయని చెబుతున్నారు. తెలంగాణ ప్రతిష్టాత్మక పథకాలు అయిన రైతుబంధు, కళ్యాణలక్ష్మీ పథకాలు ఈ గ్రామాల ప్రజలకు వర్తిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచే రోడ్లు, భవనాలు, పాఠశాలలను నిర్మించిదని చెబుతున్నారు. ఈ గ్రామాల ప్రజలు తెలంగాణలో చేరేందుకు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. అయితే మహారాష్ట్ర రాజూరా నియోజకవర్గం పరిధి ఈ గ్రామాలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ దోంతే ప్రజల అభిష్టాన్ని తోసిపుచ్చారు. ఇక్కడ ప్రజల్లో ఎక్కువ శాతం మరాఠీనే మాట్లాడుతారని.. వారంతా మహారాష్ట్రలోనే ఉంటారని చెబుతున్నారు.

Show comments