Maharashtra: మహారాష్ట్రలో ఓ టీనేజ్ బాలిక తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయేందుకు ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడింది. చివరకు పోలీసు విచారణలో అసలు విషయం తెలిసింది. వివరాల్లోకి వెళ్తే పాల్ఘర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక కిడ్నాప్ తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయేందుకు కట్టకథను అల్లింది. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. పాల్ఘర్ లోని విరార్ ప్రాంతంలో నివసిస్తున్న బాలిక, స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తుంది. బాలిక శుక్రవారం పని కోసం వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని విరార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.
Read Also: MSK Prasad-Ambati Rayudu: రాయుడు కోసం ఎంతో చేశా.. ఆ విషయాలు ఎవరికీ తెలియవు: ఎమ్మెస్కే ప్రసాద్
బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ లోగా బాలిక తన సోదరుడికి వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పంపింది. తనను కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 363 కిడ్నాప్ కింద కేసు నమోదు చేశారు. విచారణలో బాలిక కిడ్నాప్ ఫేక్ అని తెలిసింది. బాలిక తన ప్రియుడితో విమానంలో కోల్ కతా పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసు బృందం కోల్‌కతాకు వెళ్లినట్లు అధికారి తెలిపారు.