NTV Telugu Site icon

Maharashtra: వామ్మో.. పరీక్ష కోసం ఓ స్టూడెంట్ ఎంత పని చేశాడంటే..!

Maha

Maha

దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే విద్యార్థులు ఉరుకులు, పరుగులతో ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకుంటున్నారు. ఇక మహా నగరాల్లో అయితే ఉదయాన్నే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. దీంతో పరీక్షా కేంద్రాలకు చేరాలంటే నరకం కనిపిస్తోంది. ఒకవేళ ట్రాఫిక్‌లో చిక్కుకుంటే అంతే సంగతులు. ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో తెలిసిందే. అయితే ఇప్పుడు మెట్రో రైళ్లు, క్యాబ్‌లు, బైకులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఏదొకటి ఆశ్రయించి ఎగ్జామ్ సెంటర్లకు చేరొచ్చు. కానీ మహారాష్ట్రలో ఒక స్టూడెంట్ అయితే మహా సాహసమే చేశాడు. పరీక్షకు కేవలం 20 నిమిషాలే మిగిలి ఉంది. అంతే బుర్రకు పదునుపెట్టి.. అనుకున్న సమయానికి చేరుకున్నాడు. ఇదిలా సాధ్యమైందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Road Accident: వ్యవసాయ కూలీల మృతిపై సీఎం విచారం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం!

మహారాష్ట్రలోని సతారా జిల్లా వై తాలూకాలోని పసరణి గ్రామానికి చెందిన సమర్త్ మహాంగడే అనే విద్యార్థి పరీక్షకు 15-20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఆ సమయంలో రోడ్డు మార్గం ద్వారా వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకుంటాడు. అంతే భారీ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా పారాగ్లైడింగ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నాడు. పారాగ్లైడింగ్ ద్వారా అనుకున్న సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి. కాలేజీ బ్యా్గ్ తగిలించుకుని ఆకాశంలో ఎగురుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.