Site icon NTV Telugu

Breaking : మహా సంక్షోభంలో మరో ట్విస్ట్‌.. షిండే శిబిరానికి మరో నలుగురు ఎమ్మెల్యేలు..

Uddhav Thackeray Eknath Shi

Uddhav Thackeray Eknath Shi

మహారాష్ట్రలో  రాజకీయం మరింత ముదిరింది. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే రాజీనామా చేసేందుకు సిద్ధమతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటిబాట పట్టారు. అధికారిక బంగ్లా ‘వర్షా’ను ఖాళీ చేసి సొంత నివాసం ‘మతోశ్రీ’కి వెళ్లిపోయారు. అయితే.. ఇప్పుడు మహారాష్ట్ర సంక్షోభంలో మరో ట్విస్టు చోటు చేసుకుంది. మరో నలుగురు శివసేన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌షిండే శిబిరానికి చేరుకున్నారు.

మరోవైపు సంక్షోభం సమసిపోవాలంటే రెబెల్ నేత షిండేను సీఎం చేయాలని థాక్రేకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ సూచించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నాటకీయ పరిణామాల మధ్య థాక్రే రాజీనామా చేస్తారని, లేకపోతే అసెంబ్లీని రద్దు చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, సొంత నివాసానికి వెళ్లినా థాక్రేనే సీఎంగా ఉంటారని పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. అవసరమైతే అసెంబ్లీలో బల నిరూపణకు కూడా సిద్ధమన్నారు. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Exit mobile version