NTV Telugu Site icon

Maharashtra: లింగమార్పిడి చేయించుకున్న పోలీస్ కానిస్టేబుల్.. మగబిడ్డకు తండ్రయ్యాడు..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్ర బీడ్ జిల్లాలో లింగమార్పిడి చేయించుకున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ మగబిడ్డకు తండ్రయ్యాడు. మజల్ గావ్ తాలుకాలోని రాజేగావ్‌కి చెందిన లలిత్ కుమార్ సాల్వే జనవరి 15న మగబిడ్డకు తండ్రి అయ్యాడు. ఇతను 2020లో లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని పురుషుడిగా మారాడు. ఆ తర్వాత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు.

జూన్ 1988లో జన్మించిన లలితా సాల్వే, తన శరీరంలో మార్పులను చూసి వైద్య పరీక్షలు చేయించుకోగా.. Y క్రోమోజోమ్ ఉనికి ఉన్నట్లు తేలింది. సహజంగా పురుషుడు X మరియు Y సెక్స్ క్రోమోజోమ్‌లను కలిగి ఉంటే, స్త్రీలు రెండు X క్రోమోజోమ్‌లను కలిగి ఉంటారు. దీంతో సాల్వేకి జెండర్ డిస్ఫోరియా ఉందని, లింగమార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

2018లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత అతను లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 2018-2020 మధ్య మూడు సార్లు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. 2020లో లలిత్ సాల్వేకి ఛత్రపతి శంభాజీ నగర్‌కి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. మీడియాతో మాట్లాడిన సాల్వే.. స్త్రీ నుంచి పురుషుడిగా మారేందుకు అనేక పోరాటాలు చేశానని, ఆ సమయంలో తనకు మద్దతు నిలిచిన వారికి థాంక్స్ తెలిపారు. నా భార్య సీమ ఒక బిడ్డను కలిగి ఉండాలని కోరుకుందని, ఇప్పుడు తండ్రైనందుకు చాలా సంతోషంగా ఉందని, నా కుటుంబం థ్రిల్‌గా ఫీల్ అవుతుందని చెప్పారు.

Show comments