Site icon NTV Telugu

Maharashtra: భర్తలు రూ.100 కూడా ఇవ్వరు.. అలాంటిది ఫడ్నవిస్ మహిళలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారు.. ఓ మంత్రి కీలక వ్యాఖ్యలు

Maharashtra

Maharashtra

మహిళలను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి జయకుమార్ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో భర్తలు అవసరాలకు రూ.100 కూడా ఇవ్వరని.. అలాంటిది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివిస్.. లడ్కీ బహిన్ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి మహిళ ఫడ్నవిస్‌కు కృతజ్ఞతగా బీజేపీకి ఓటువేసి విధేయత చూపించాలని కోరారు. ఓటు వేసేటప్పుడు ఫడ్నవీస్ ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తుంచుకోవాలని మహిళా ఓటర్లను కోరారు.

ఇది కూడా చదవండి: Pinarayi Vijayan: కేరళ సీఎంకు ఈడీ నోటీసులు.. దేనికోసమంటే..!

డిసెంబర్ 2న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం షోలాపూర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ మాట్లాడుతూ… స్థానిక ఎన్నికల సమయంలో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. కానీ ప్రతి నెల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే రూ. 1,500 స్టైఫండ్‌ను గుర్తుంచుకోవాలని సూచించారు. ఫడ్నవిస్ అధికారంలో లేకపోతే మీ అకౌంట్లు డబ్బులు పడేవా? అని అడిగారు. అందుకే ఫడ్నవిస్ పట్ల విధేయత చూపించాలని విజ్ఞప్తి చేశారు. రక్షా బంధన్ సమయంలో కూడా సోదరులు తమ సోదరీమణులకు డబ్బు బహుమతిగా ఇచ్చేటప్పుడు వారి భార్యల అనుమతి తీసుకుంటారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మహాయుతి మిత్రులపై కూడా మంత్రి విమర్శలు చేశారు. పాలక వర్గంలోని కొన్ని పార్టీలు ఖజానా తమ దగ్గర ఉందని చెప్పుకుంటున్నప్పటికీ తుది ఆమోదం బీజేపీదేనని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్‌ను అభినందించిన మోడీ

246 మునిసిపల్ కౌన్సిల్‌లు, 42 నగర పంచాయతీలకు డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 1.07 కోట్లకు పైగా ఓటర్లు 6859 మంది సభ్యులను, 288 మునిసిపల్ అధ్యక్షులను ఎన్నుకుంటారు.

Exit mobile version