NTV Telugu Site icon

Election Commission: నేడు జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్..

Ec

Ec

Election Commission: జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగబోతుంది. భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం3.30 గంటలకు ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల షెడ్యూల్‌ను తెలిపనుంది. దీనికి సంబంధించి ఈసీ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ మీడియా సమావేశం జరగనుందని ప్రకటించింది. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది. ఇక, జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 5, 2025తో ముగియనుంది. మహారాష్ట్రలో 288 సీట్లు ఉండగా, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

Read Also: Mandi Masjid Controversy: మసీదు అక్రమ నిర్మాణ తొలగింపుపై స్టే.. విచారణ ఈ నెల 20కి వాయిదా..!

అయితే, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అధికార మహాయుతి కూటమి శివసేన (షిండే), ఎన్‌సీపీ (అజిత్ పవార్)తో పాటు శివసేన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి మధ్య ద్విముఖ పోరు సాగుతుందని భావిస్తున్నారు. అలాగే, జార్ఖండ్‌లో బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ తో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కి వ్యతిరేకంగా భారత కూటమిలో భాగమైన అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా పోటీ పడుతుంది. కాగా, అనధికారిక సమాచారం ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు నవంబర్‌ రెండో వారంలో లేదా మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం.