Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- మహారాష్ట్రలో దారుణం
- పెట్రోల్ బంక్ సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారిపై దాడి
- 7 సార్లు కత్తితో పొడిచి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్‌ను సీజ్ చేసేందుకు వెళ్లిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) అధికారిని కత్తితో పొడిచి హత్య చేశారు. హింగోలీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇండియన్ ఆయిల్ సేల్స్ మేనేజర్ మహేశ్ షెల్కే ప్రాణాలు కోల్పోయారు. పెట్రోల్ బంక్ ఆపరేటర్ కుటుంబంతో తలెత్తిన వివాదం ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.
మంగళవారం సాయంత్రం చోంధి గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరకు మహేశ్ షెల్కేతో పాటు కంపెనీ అధికారులు వెళ్లారు. సాంకేతిక సమస్యల కారణంగా ఆ పెట్రోల్ బంక్ గత మూడు నెలలుగా మూసి ఉంది. దీంతో కంపెనీ నిబంధనల ప్రకారం బంక్‌ను సీజ్ చేసేందుకు అధికారులు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఈ పెట్రోల్ బంక్‌ను సాహెబ్రావ్ పాండవ్‌వీర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు సీజ్ ప్రక్రియ చేపట్టే సమయంలో మరో నెల రోజుల గడువు ఇవ్వాలని ఆపరేటర్ కుటుంబ సభ్యులు కోరినట్లు సమాచారం. అయితే అధికారులు అందుకు అంగీకరించకపోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Also Read
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో సాహెబ్రావ్ పాండవ్‌వీర్ కుమారుడు ఉమేశ్ పాండవ్‌వీర్.. మహేశ్ షెల్కేపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆయనను ఏకంగా ఏడుసార్లు కత్తితో పొడిచినట్లు వెల్లడించారు. ఈ దాడిలో మహేశ్ షెల్కే పొత్తికడుపు, వీపు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఆయన.. చికిత్స అందించేలోపే ప్రాణాలు కోల్పోయారు.
దాడి అనంతరం నిందితుడు ఉమేశ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు రెండు కార్లలో అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కురుందా పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహేశ్ షెల్కే మృతిపై ఇండియన్ ఆయిల్ చైర్మన్ అర్విందర్ సింగ్ సహ్నీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే తమ సహోద్యోగిపై దాడి చేసి హత్య చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన సహ్నీ.. మహేశ్ షెల్కే కుటుంబానికి కంపెనీ అండగా ఉంటుందని తెలిపారు. నిందితులపై వేగంగా, కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
హర్దీప్ పూరీ
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహేశ్ షెల్కే హత్యను ‘షాకింగ్, ఆమోదయోగ్యం కాని హింసాత్మక చర్య’గా అభివర్ణించారు. హింగోలీ జిల్లాలో ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్‌లెట్‌ను కంపెనీ స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా వెళ్లిన అధికారుల బృందంలో మహేశ్ షెల్కే ఉన్నారని పూరీ తెలిపారు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే పదునైన ఆయుధంతో ఆయనపై దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితులపై చట్ట ప్రకారం వేగంగా, కఠిన చర్యలు తీసుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ఉన్నతాధికారులతో ఈ అంశాన్ని చర్చించినట్లు పూరీ తెలిపారు. దేశానికి ఇంధన సేవలు అందించేందుకు పనిచేస్తున్న సిబ్బంది భద్రత, గౌరవం, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Deeply saddened and shocked by the tragic incident in which Shri Mahesh Shelke, Manager (Retail Sales), IndianOil, lost his life in Maharashtra while discharging his official duties. He was a part of a team carrying out the takeover of an IndianOil retail outlet in Hingoli district when he was brutally attacked with a sharp weapon. I strongly condemn this heinous and unacceptable act of violence.
I offer my heartfelt condolences to the bereaved family in their hour of unimaginable grief and shock.
@PetroleumMin and @IndianOilcl firmly stand with them and will extend all possible support.The issue has been taken up with the senior-most officials of the Maharashtra Government and Police to ensure swift and strict action against those responsible, in accordance with law.
The safety, dignity and security of our energy-sector personnel, who work tirelessly to serve the nation, remain paramount.May the departed soul rest in peace.
Om Shanti. 🙏— Hardeep Singh Puri (@HardeepSPuri) October 7, 2026
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!