Site icon NTV Telugu

రేపు ప‌బ్లిక్ హాలిడేగా ప్ర‌క‌టించిన స‌ర్కార్..

భారత రత్న, గాన కోకిల లతా మంగేష్కర్ క‌న్నుమూసింది.. త‌న గానామృతంతో యావ‌త్ భార‌తాన్నే కాదు.. ప్ర‌పంచ‌దేశాల‌ను సైతం ఆక‌ట్టుకున్న ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.. ఇక‌, లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 7వ తేదీన‌ ప్రభుత్వ సెలవుగా ప్ర‌క‌టించింది.. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.. మ‌రోవైపు.. ప‌శ్చిమ బెంగాల్ స‌ర్కార్ హాఫ్ హాలీడేగా ప్ర‌క‌టించింది.. ఫిబ్ర‌వ‌రి 7న హాఫ్ హాలీడేగా నిర్ణ‌యించిన‌ట్టు బెంగాల్‌లోని మ‌మ‌తా బెన‌ర్జీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.. కాగా, ముంబైలో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ల‌తా మంగేష్క‌ర్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్నాయి.. ఇప్పటికే ల‌తా మంగేష్క‌ర్ భౌతిక‌కాయానికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ల‌తా మంగేష్క‌ర్‌కు క‌న్నీటి వీడ్కోలు ప‌లుకుతున్నారు నెటిజ‌న్లు.

Read Also: బీజేపీ ఎంపీలు, నాయకులు కుక్కల్లా అరుస్తున్నారు.. ద‌మ్ముంటే..!

Exit mobile version