దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, మహారాష్ట్రలో మాత్రం కేసులు తగ్గడంలేదు. మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొల్హాపురి, సాతారా, పాల్ఘాట్, రాయ్‌గడ్, సంధూదుర్గ్, రత్నగిరి, పూణే రూరల్, సాంగ్లీ జిల్లాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తొంది. కరోనా కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం రోజున 8,535 కేసులు నమోదవ్వగా 158 మరణాలు నమోదయ్యాయి. 8 జిల్లాల నుంచే అధికంగా కేసులు వస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ జిల్లాలపై దృష్టి సారించింది. టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటుగా, ఆయా జిల్లాల్లో హాట్‌స్పాట్‌లను గుర్తించి రోగులను ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు.
మహాసర్కార్‌ను భయపెడుతున్న ఆ 8 జిల్లాలు…
