హిందీలో రీమేక్ కాబోతున్న ‘సూరారై పోట్రు’

సూర్య కథానాయకుడిగా రూపుదిద్దుకున్న ‘సూరారై పోట్రు’ తమిళంలోనే కాదు ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో తెలుగులో డబ్ అయ్యి, ఓటీటీలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు సూర్య అభిమానులనూ అలరించింది. సుధా కొంగర దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను నిర్మించిన సూర్య ఇప్పుడు హిందీలోనూ దీన్ని రీమేక్ చేస్తున్నట్టు తెలిపారు. సూర్యకు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు అబుందాంతియా ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విక్రమ్ మల్హోత్రా ఈ సినిమాను హిందీలో నిర్మిస్తున్నారు.

Read Also : హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు !

హిందీలో సూర్య పాత్రను ఎవరు చేయబోతున్నారనేది నిర్మాతలు తెలియచేయలేదు. కానీ మెగా ఫోన్ మాత్రం దర్శకురాలు సుధా కొంగరనే పట్టుకోబోతున్నారు. గతంలోనే ఆమె మాధవన్ తో ‘సాలా ఖద్దూస్’ (తెలుగు ‘గురు’) చిత్రాన్ని హిందీలో తీశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ, ”’సూరారై పోట్రు’ పై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం అపూర్వమైనవి. ఈ కథ విన్న సమయంలోనే ఇది పాన్ ఇండియా మూవీ అవుతుందని అనిపించింది. ఆ కథలోని ఆత్మ అలాంటిది. కెప్టెన్ గోపీనాథ్ కథను హిందీలోకి తీసుకెళ్ళడం ఆనందం ఉంది” అని అన్నారు. ‘సూరారై పోట్రు’ను హిందీలోనూ తెరకెక్కించడం ఆనందంగా ఉందని, మాతృకకు లభించినట్టే, హిందీలోనూ ఈ చిత్రానికి ఆదరణ లభిస్తుందనే ఆశాభావాన్ని సుధా కొంగర వ్యక్తం చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-