Ajit Pawar Plane Crash: మహారాష్ట్రలోని బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఈరోజు ఉదయం 8: 45 గంటలకి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నారు, అందులో అజిత్ పవార్, ఇద్దరు సిబ్బంది (ఒకరు PSO, ఒకరు అటెండెంట్)తో పాటు ఇద్దరు పైలెట్స్ ఉన్నారు. ఈ ప్రమాదంలో బ్రతికి లేరని చెప్పుకొచ్చారు. ఈ ఘటన స్థలానికి పుణే రూరల్ SP సహా సెక్యూరిటీ ఏజెన్సీలు వెంటనే చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
Read Also: Ajit Pawar: కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్..
కాగా, ఈ ప్రమాదానికి గురైన విమాన వివరాలు:
* ముంబైకి చెందిన VSR వెంచర్స్‌కు చెందిన ప్రైవేట్ విమానంగా గుర్తింపు..
* విమాన రకం: Learjet 45
* విమాన నమోదు నంబర్: VT-SSK
* ప్రమాద స్థలం: బారామతి ఎయిర్‌పోర్ట్
* విమానంలో ఉన్న వ్యక్తులు: 5 ( అజిత్ పవార్ సహా ఇద్దరు పైలెట్స్+ ఇద్దరు సిబ్బంది)..
* ఈ విమానం బంబార్డియర్ లీర్జెట్ 45 రకం..
కాగా, ఈ ఘోర ప్రమాదం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద షాక్ అని చెప్పాలి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని రాజకీయ వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.
