చట్టాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే చట్టాలు తప్పితే ఇంకెవరు? రక్షణగా ఉంటారు. చెట్లు నరికివేత. అక్రమ ఇసుక తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటోందని న్యాయస్థానాలు మొత్తుకుంటున్నాయి. ప్రభుత్వాలను తీవ్రంగా మందలిస్తున్నాయి. గురువారం కూడా సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా ప్రభుత్వ పెద్దల్లో ఏ మాత్రం చలనం ఉండడం లేదు. తాజాగా అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఒక ఐపీఎస్‌పై ఏకంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చిందులు లేశారు. మా వాళ్లను తక్షణమే వదిలిపెట్టకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump: టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు.. కనిపించని ఎలాన్ మస్క్
మహారాష్ట్రలోని షోలాపూర్‌లోని కుర్దు గ్రామంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ ఫిర్యాదు వచ్చింది. దీంతో మహిళా ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ గ్రామానికి వెళ్లి మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. ఇంతలోనే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నుంచి ఫోన్ వచ్చింది. ఎన్‌సీపీ కార్యకర్తలు ఫోన్ ఇవ్వగా.. తన నెంబర్‌కు ఫోన్ చేయాలంటూ ఐపీఎస్ సూచించారు. దీంతో అంజనా కృష్ణ మొబైల్‌కు అజిత్ పవార్ ఫోన్ చేసి.. నీకెంత ధైర్యం? మా వాళ్లనే అడ్డుకుంటావా? తక్షణమే వెళ్లిపోవాలని తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. లేదంటే యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Joe Biden: మాజీ అమెరికా అధ్యక్షుడుకు ఏమైంది? తలపై ఆ గాయమేంటి?
ఆగస్టు 31న జరిగిన సంఘటనకు సంబంధించి రెండు నిమిషాల నిడివి గల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒక పొలంలో అక్రమ తవ్వకాలను ఐపీఎస్ అట్టుకున్నారు. ఆ సమయంలో అజిత్ పవార్ ఫోన్ చేశారు.. ‘‘వినండి.. నేను ఉప ముఖ్యమంత్రిని.. వదిలేసి వెళ్లిపోవాలని మీకు ఆదేశిస్తున్నాను. లేదంటే మీపై చర్య తీసుకుంటాను. మీరు నన్ను చూడాలనుకుంటున్నారు. సరియైనదా? మీ నెంబర్ ఇవ్వండి లేదా వాట్సాప్‌లో కాల్ చేయండి. మీరు నా ముఖం గుర్తిస్తారు. సరియైనదా?’’ అని ఐపీఎస్‌తో అజిత్ పవార్ సంభాషించారు.
అంజనా కృష్ణ కేరళ నివాసి. ఇటీవలే ఆమెకు మహారాష్ట్రలో పోస్టింగ్ పడింది. దీంతో వెంటనే అజిత్ పవార్ స్వరాన్ని గుర్తించలేకపోయారు. దీంతో ఐపీఎస్‌పై డిప్యూటీ సీఎం చిందులేశారు. వీడియో వైరల్‌గా మారింది.
అయితే వీడియోను ఉద్దేశపూర్వకంగానే విడుదల చేశారంటూ ఎన్సీపీ ఎంపీ సునీల్ తత్కరే ఆరోపించారు. పార్టీ కార్యకర్తలను శాంతింపజేయడానికి అజిత్ పవార్ అలా మాట్లాడారని.. ఆ క్రమంలో ఐపీఎస్ అధికారిని మందలించి ఉండవచ్చని చెప్పుకొచ్చారు. అంతే తప్ప మట్టి తవ్వకాలను ఆపమని చెప్పడం అజిత్ పవార్ ఉద్దేశం కాదని కవర్ చేశారు. అజిత్ పవార్ ముక్కుసూటిగా మాట్లాడతారని.. ఆయన ఎలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడరని కితాబు ఇచ్చారు. అలాంటి వారికి కూడా మద్దతు ఇవ్వరని పేర్కొన్నారు. కార్యకర్తల మెప్పు కోసం కొంచెం మందలించే విధంగా ఐపీఎస్‌తో మాట్లాడి ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
अजित पवारांचा #IPS अधिकाऱ्याला थेट फोन आणि व्हिडिओ कॉलद्वारे "कारवाई थांबवा"चा आदेश. हा सत्तेचा दुरूपयोग आहे.DySP अंजली कृष्णा यांनी कायदा पाळला, पण उपमुख्यमंत्र्यांनी धमकावलं? मुरुमासाठी इतका हस्तक्षेप का? महाराष्ट्रात खरंच काय चाललंय? अशाच कामांसाठी राज्यातील नेत्यांना आपल्या… pic.twitter.com/bP4uoiStqK
— Vijay Kumbhar (@VijayKumbhar62) September 4, 2025
महाराष्ट्र
सोलापुर: मुर्रम की अवैध खुदाई पर IPS अंजना कृष्णा की कार्रवाई के दौरान अजित पवार ने फोन पर लगाई फटकारवीडियो वायरल, NCP नेता के हस्तक्षेप से पुलिस कार्रवाई पर उठे सवाल
अवैध खनन माफियाओं पर कार्रवाई के बीच अफसर-पॉलिटिक्स टकराव चर्चा में pic.twitter.com/nrOKNHVmqi
— अजयेंद्र राजन शुक्ल / Ajayendra Rajan Shukla 🇮🇳 (@AjayendraRS) September 4, 2025
