Site icon NTV Telugu

Maharashtra Politics: మామ మండలి ఛైర్మన్.. అల్లుడు అసెంబ్లీ స్పీకర్

Legislative Council Chairman Son In Law Becomes Assembly Speaker

Legislative Council Chairman Son In Law Becomes Assembly Speaker

మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏక్‌నాథ్ షిండే సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అందుకోసం రెండు రోజులుపాటు అసెంబ్లీ సమావేశాలను జరిపేందుకు సిద్దమైంది. అందులో భాగంగానే సమావేశంలో తొలిరోజైన స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ పదవి కోసం భాజపా తరపున రాహుల్‌ నర్వేకర్‌.. మహావికాస్ అఘాడీ తరపున రాజన్‌ సాల్వీ పోటీపడ్డారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే భాజపాతో చేతులు కలిపిన నేపథ్యంలో రాహుల్‌ నర్వేకర్‌ స్పీకర్​ పదవికి ఎన్నికయ్యారు. రాహుల్ నర్వేకర్‌కు అనుకూలంగా 164 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 107 ఓట్లు పడ్డాయి. స్పష్టమైన మెజార్టీ సాధించడం వల్ల స్పీకర్‌గా రాహుల్ ఎన్నికైనట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అనంతరం రాహుల్​ నర్వేకర్‌కు ముఖ్యమంత్రి షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ అభినందనలు తెలిపారు.

Kishan Reddy : మీ నుండి బాప్-బేటా పాలన నేర్చుకోవాలా

అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనమండలి ఛైర్మన్‌గా మామ, అల్లుడు అసెంబ్లీగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఏక్‌నాథ్ షిండే వర్గం మద్దతుతో స్పీకర్‌గా ఎన్నికైన భాజపా నేత రాహుల్‌ నర్వేకర్‌.. మండలి ఛైర్మన్‌గా ఉన్న రామ్‌రాజే నాయక్‌కు స్వయానా అల్లుడు అవుతారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా తెలిపారు. మామ రామ్‌రాజే నాయక్‌ మాత్రం ఎన్‌సీపీకి చెందిన వ్యక్తి కాగా.. అల్లుడు రాహుల్‌ నర్వేకర్‌ మాత్రం భాజపా నేత కావడం గమనార్హం. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్‌ షిండే అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధమయ్యారు. ఇందుకు సోమవారం ముహూర్తం ఖరారయ్యింది. బలనిరూపణలో ఏక్‌నాథ్ షిండే గెలుపు ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version