Site icon NTV Telugu

Maharashtra Political Crisis: ఉద్ధవ్‌ థాక్రే రాజీనామా..?

Uddhav Thackeray

Uddhav Thackeray

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక మలుపు తీసుకుంది.. శివసేన ఎమ్మెల్యేలు రెండుగా చీలడం… సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం కంటే.. శివసేన రెబల్స్‌ వర్గం సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. సీఎం ఉద్ధవ్‌ థాక్రే పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైంది పరిస్థితి.. అసలే కరోనా మహమ్మారిబారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన.. కాసేపట్లో సోషల్‌ మీడియా వేదికగా మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు… ఇప్పటికే ట్విట్టర్‌లో మంత్రి హోదాను ఆదిత్య థాక్రే తొలగించుకోవడం ఆస్తికరంగా మారగా.. శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహా రాజకీయాల్లో హీట్‌ పెంచుతున్నాయి.. శివసేకు ఉన్న మొత్తం 55మంది ఎమ్మెల్యేల్లో ఏక్‌నాథ్‌ షిండే వెంటే 34మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. సీఎం ఉద్ధవ్‌ థాక్రే వైపు మిగిలింది కేవలం 21 మందే కావడంతో రాజీనామాకు సిద్ధపడినట్టుగా తెలుస్తోంది..

Read Also: Sonia Gandhi: ఈడీకి సోనియా గాంధీ లేఖ.. మరింత సమయం ఇవ్వండి..

కాసేపట్లో మహారాష్ట్ర సంక్షోభంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.. ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న మహారాష్ట్ర సీఎం థాక్రే.. ప్రభుత్వ సంక్షోభంపై కీలక ప్రకటన చేయబోతున్నారు.. రాజకీయ సంక్షోభంతో శివసేన ఎమ్మెల్యేలు రెండుగా చీలిన విషయం తెలిసిందే కాగా.. తమదే అసలైన శివసేన అంటూ గవర్నర్‌కు 34 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు లేఖ రాశారు.. తమ నేతగా ఏక్‌నాథ్‌ షిండేను ఎన్నుకున్నారు రెబల్‌ ఎమ్మెల్యేలు.. గౌహతి క్యాంప్‌లో 34 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు మకాం వేశారు.. బుజ్జగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఏక్‌నాథ్‌ షిండే వెనక్కి తగ్గకపోవడంతో.. మైనార్టీలో పడిన ప్రభుత్వాన్ని కొనసాగించలేమనే నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే.. రాజీనామా చేసేందుకే మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై కాసేపట్లో క్లారిటీ రాబోతోంది.

Exit mobile version