Maharashtra Cabinet: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 14 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉందని, మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పని చేసిన ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసిన అనంతరం.. జూన్ 30న శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం స్వీకారం చేశారు. బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు మాజీ మంత్రులకు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి ప్రభుత్వం ఇద్దరు కేబినెట్ సభ్యులతో పని చేస్తోంది. ఇద్దరితోనే ప్రభుత్వం కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్సీపీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సహా ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్‌ను విస్తరించాలని ఏక్‌నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు.
Parliament Monsoon Session: పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా.. వెంకయ్యకు ఘన వీడ్కోలు
ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని కేబినెట్‌లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, షిండే వర్గం నుంచి గులాబ్ రఘునాథ్ పాటిల్, సదా సర్వాంకర్, దీపక్ వసంత్ కేశార్కర్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.
