NTV Telugu Site icon

Assembly Polls: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో పోటెత్తిన ఓటర్లు.. పోలింగ్ శాతం ఎంతంటే..!

Maharashtraelections

Maharashtraelections

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు. అలాగే సల్మాన్‌‌ఖాన్, షారూఖ్‌ఖాన్‌తో సహా పలువురు నటులు ఓటు వేశారు.

మహారాష్ట్రలో దాదాపు 58.22 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. చివరి రెండు గంటల్లో ఓటర్లు పోటెత్తారు. దీంతో పోలింగ్ శాతం పెరిగింది. ఉదయం మాత్రం కొంచెం మందకొడిగా సాగింది. సాయంత్రమే ఓటింగ్ శాతం పెరిగింది. ఇక జార్ఖండ్‌లో జరిగిన రెండో విడత పోలింగ్‌లో భారీగానే ఓటింగ్ శాతం నమోదైంది. దాదాపు 67.59 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా వార్తలు అందుతున్నాయి.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో బుధవారం పోలింగ్ జరిగింది. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి విడత నవంబర్ 13న 43 స్థానాలకు ఓటింగ్ జరిగింది. సెకండ్ విడత బుధవారం 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో విడతలో జార్ఖండ్ ఓటర్లు పోలింగ్ బూత్‌లకు పోటెత్తారు. భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. ఇక ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న విడుదలకానున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమినే హవా నడుస్తోంది. మహారాష్ట్రలో తిరిగి మహాయుతి కూటమి విజయం సాధిస్తోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అలాగే జార్ఖండ్‌లో కూడా ఎన్డీఏ కూటమినే జయకేతనం ఎగురవేయబోతుంది. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌ల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.