NTV Telugu Site icon

Earthquake: అండమాన్‌లో భూకంపం.. 4.3 తీవ్రతతో ప్రకంపనలు

Earthquake

Earthquake

Earthquake: ఈ రోజు తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడిచింది. అండమాన్ సముద్రంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Read Also: India Is With Israel: “ఇజ్రాయిల్‌కి అండగా భారత్” సోషల్ మీడియాలో ట్రెండింగ్..థాంక్స్ తెలిపిన ఇజ్రాయిల్

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ హెరాత్ ప్రావిన్సులో భారీ భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతలో భూకంపం రావడంతో తీవ్ర విషాదం నెలకొంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఐదుసార్లు భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 120 మంది చనిపోగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇంటీరీయర్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ విపత్తు నుంచి రక్షించాలని ప్రపంచదేశాల సాయాన్ని తాలిబాన్లు కోరారు.