NTV Telugu Site icon

Madras High Court: “నీ యూట్యూబ్ ఛానెల్ వెంటనే మూసేయ్, నీకు గుణపాఠం కావాలి”.. యూట్యూబర్ వాసన్‌పై కోర్టు ఆగ్రహం..

Vasan

Vasan

Madras High Court: తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, బైక్ రేసర్ టీటీఎఫ్ వాసన్‌కి బెయిల్ ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, యువతను ప్రేరేపిస్తున్న అతనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబ్ ఛానెల్ ని వెంటనే మూసేయాలని ఆదేశించింది. వాసన్‌కి 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బైక్ స్టంట్లు, రోడ్ ట్రిప్పులు చేస్తూ యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేస్తుంటాడు.

అయితే సెప్టెంబర్ 17న వాసన్ చెన్నై-వేలూరు హైవేపై అతివేగంగా వెళ్తూ స్టంట్స్ చేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. అయితే హెల్మెట్, రేస్ సూట్, వేసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే కొద్ది పాటి గాయాలతో ప్రాణాలతో భయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

Read Also: PM Modi: కాంగ్రెస్ ప్రజల కన్నా తన ఓటు బ్యాంకునే ఎక్కువగా ప్రేమిస్తుంది..

ఈ కేసులో బెయిల్ కోసం వాసన్ కాంచిపురం సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ..‘‘ వాసన్ యూట్యూబ్ ఛానెల్ కి 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇతను రూ. 20 లక్షల బైక్‌పై రూ. 3 లక్షల రేస్ సూట్ ధరించి ప్రమాదకర స్టంట్లు చేస్తూ, ఖరీదైన బైకులు కొని రేసింగ్ కి రావాలంటూ యువతను ప్రేరేపిస్తున్నాడంటూ’’ న్యాయస్థానానికి తెలిపారు.

పీపీ వాదనలో ఏకీభవించిన కోర్టు..యువతను ర్యాష్ డ్రైవింగ్ వైపు తీసుకెళ్లేలా ప్రేరేపిస్తున్న వాసన్ బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తున్నట్లు కోర్టు తీర్పు చెప్పింది. వెంటనే యూట్యూబ్ ఛానెల్ ని మూసేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీనిపై అతను గుణపాఠం నేర్చుకోవాల్సిందే అని ఆగ్రహం వ్యక్తం చేసింది.