Site icon NTV Telugu

Madras High Court: తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగింపుపై సంచలన తీర్పు

Madras High Court

Madras High Court

తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగింపుపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆలయ దేవస్థానం తప్పనిసరిగా దీపం వెలిగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రజా సమూహం లేకుండా ఆచారాన్ని నియంత్రిత పద్ధతిలో నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కెకె రామకృష్ణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. దీంతో తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఇది కూడా చదవండి: Silver Rates: సిల్వర్ మళ్లీ విశ్వరూపం.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

తిరుపరంకుండ్రం కొండ తమిళనాడులోని మధురైకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతనమైన పవిత్రకొండ. కొండపై సుబ్రమణ్యస్వామి ఆలయం చెక్కబడింది. దీన్ని భారత ప్రభుత్వం రక్షిత స్మారక చిహ్నంగా గుర్తించింది. అయితే ఈ కొండపై ఇతర మతపరమైన కట్టడాలు కూడా ఉన్నాయి. దర్గా (మసీదు), జైన అవశేషాలు ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ మధ్య తీవ్రమయ్యాయి.

ఇది కూడా చదవండి: Indonesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి

అయితే కొండపై దర్గా ఉన్న కారణాన హిందూ మతపరమైన ఆచారంలో భక్తులకు దీపం వెలిగించే హక్కు ఉందా? అనే అంశంపై మత సంస్థలు, తమిళనాడు ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందని స్టాలిన్ ప్రభుత్వం పేర్కొంది.

మంగళవారం విచారించిన ధర్మాసనం.. రిట్ అప్పీలుపై తీర్పును వెలువరిస్తూ.. కొండపై దీపం వెలిగించడానికి ఆలయ దేవస్థానానికి అనుమతి ఇచ్చింది. నిర్వహించే హక్కు ఉందని తీర్పునిచ్చింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ పేర్కొంది. కోర్టు ఆదేశాలను పాటించేలా.. ఆచార నిర్వహణ సమయంలో క్రమశిక్షణను కాపాడటానికి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించింది. మొత్తానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ధర్మాసనం ముగింపు పలికింది.

Exit mobile version