NTV Telugu Site icon

Ragging: దిండును పట్టుకుని ఆ పని చేయండి.. మధ్యప్రదేశ్‌లోని వైద్యకళాశాలలో ర్యాగింగ్ భూతం

Ragging

Ragging

Ragging: మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. ఎంబీబీఎస్ సీనియర్ విద్యార్థుల బృందం జూనియర్లను అసభ్యకరంగా దుర్భాషలాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థుల వివరాలు వెల్లడి కాలేదు. ఇండోర్‌లోని ఎంజీఎం మెడికల్ కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడిన సంఘటన తర్వాత జూనియర్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి తమ కష్టాలను వివరించారు. దిండుతో, బ్యాచ్‌మేట్స్‌తో సంపర్కంలో పాల్గొన్నట్లు నటించాలంటూ సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు జూనియర్లు పోలీసులకు చెప్పారు.

ర్యాగింగ్‌ను సహించేది లేదని, ఇది విద్యార్థులను జీవితాంతం గాయపరుస్తుందన్న యూజీసీ.. వెంటనే కళాశాల ఈ ర్యాగింగ్ ఘటనపై చర్య తీసుకోవాలని కోరింది. ఆ తర్వాత కళాశాల యాంటీ-ర్యాగింగ్ కమిటీ నిందితులందరిపై పోలీసు కేసును పెట్టాలని నిర్ణయించింది. జూనియర్ల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేయడం ప్రారంభిస్తామని ఇండోర్‌ పోలీసులు వెల్లడించారు. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఓ జూనియర్ వైద్య విద్యార్థి యూజీసీ యాంటీ-ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. సీనియర్లు జూనియర్లలోని మహిళా బ్యాచ్‌మేట్ పేరును ఎన్నుకుని ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అసభ్యకర చర్యలకు పాల్పడ్డారని ఆ విద్యార్థి ఆరోపించారు.

NDRF Team Saves Biker: వాగులో చిక్కుకున్న యువకుడు.. చాకచక్యంగా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

కొంతమంది ప్రొఫెసర్లు ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ఏమి చేయకపోవడాన్ని పక్కనపెడితే.. వాస్తవానికి మద్దతు ఇస్తున్నారని యూజీసీ ఫిర్యాదు చేశారు. జూనియర్ విద్యార్థులకు సంబంధించిన ఫోన్లను లాక్కోవడంతో పాటు గుంజీలు తీయించారని, ఒకరినొకరు గట్టిగా చెప్పులతో కొట్టుకోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ గుర్తింపును బయటిపెడితే తమపై సీనియర్లు ప్రతీకారం తీర్చుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీకి చేసిన వివరణాత్మక ఫిర్యాదులో వాట్సాప్ చాట్‌తో సహా ఆడియో, వీడియో రికార్డింగ్‌ల రూపంలో ర్యాగింగ్, జూనియర్ విద్యార్థుల చిత్రహింసలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తాము మెడికల్ కాలేజీలో సంబంధిత విద్యార్థులందరి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తున్నామని.. దాని ఆధారంగా నిందితులను గుర్తించడం జరుగుతుందని స్థానిక పోలీస్ స్టేషన్ ఇంఛార్జి తహజీబ్ ఖాజీ తెలిపారు.