NTV Telugu Site icon

Electricity bill: ఓ ఇంటికి రూ.3,419 కోట్ల కరెంట్ బిల్లు.. ఆస్పత్రి పాలైన యజమాని

Electricity Bill

Electricity Bill

Electricity bill: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నివాసముంటున్న ప్రియాంక గుప్తా తన ఇంటి కరెంట్ బిల్లును చూసి షాక్‌కు గురైంది. ఆ బిల్లును చూస్తే ఆమే కాదు.. చూసిన వారెవరైనా షాక్ అవ్వాల్సిందే. రూ. 3,419 కోట్ల విద్యుత్ బిల్లును చూసి ఆమె మామ అయితే ఏకంగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ సంస్థ తప్పిదం వల్ల రూ.1300 రావాల్సిన బిల్లు తప్పుగా రూ. 3,419 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. వారు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు గుర్తించి.. తప్పు జరిగిందని మళ్లీ రూ.1300 కరెంట్ బిల్లును జారీ చేశారు. దీంతో ప్రియాంక గుప్తా కుటుంబం ఊపిరిపీల్చుకుంది.

5G Auction: ‘5జీ’ వేలానికి సూపర్‌ రెస్పాన్స్‌.. తొలిరోజే ఇలా..

జూలై నెల గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్ బిల్లులో భారీ సంఖ్యను చూసి తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని ప్రియాంక గుప్తా భర్త సంజీవ్ కంకనే తెలిపారు.జులై 20న విడుదల చేసిన బిల్లు మధ్యప్రదేశ్ మధ్య క్షేత్ర విద్యుత్ విత్రన్ కంపెనీ పోర్టల్ ద్వారా తప్పుగా ముద్రించబడింది. బిల్లును తర్వాత రాష్ట్ర విద్యుత్ సంస్థ సరిచేసిందని కంకనే చెప్పారు. భారీ విద్యుత్ బిల్లుకు మానవ తప్పిదమే కారణమని, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని ఎంపీఎంకేవీవీసీ జనరల్ మేనేజర్ నితిన్ మాంగ్లిక్ తెలిపారు. సాఫ్ట్‌వేర్‌లో వినియోగించే యూనిట్ల స్థానంలో ఒక ఉద్యోగి వినియోగదారు నంబర్‌ను నమోదు చేశారు, ఫలితంగా ఎక్కువ మొత్తంతో బిల్లు వచ్చింది. సరిచేసిన రూ.1,300 బిల్లు విద్యుత్ వినియోగదారుకు జారీ చేయబడిందనిఆయన చెప్పారు. లోపాన్ని సరిదిద్దామని, సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నామని మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ విలేకరులకు తెలిపారు.