Site icon NTV Telugu

Madhya Pradesh: విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు తగ్గించేందుకు ప్రభుత్వ కీలక నిర్ణయం

Madhya Pradesh Reduce School Bags Weight

Madhya Pradesh Reduce School Bags Weight

Madhya Pradesh government Reduce Weight Of School Bags: చిన్న వయస్సులోనే వారి స్థాయిjr మించిన బరువుతో బ్యాగులు మోస్తూ.. విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఎల్ కే జీ, యూకేజీల్లోనే బండెడు పుస్తకాలతో కుస్తీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 1,2 తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకూడదని మార్గదర్శకాలను జారీ చేసింది. మధ్యప్రదేశ్ విద్యాశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో విద్యాశాఖ నిర్ధేశించిన విధంగా స్కూలు బ్యాగుల బరువు ఉండాలని సూచింది. విద్యార్థలకు ఇచ్చిన హెం వర్క్ పర్యవేక్షించాలని కోరింది.

Read Also: Woman Molested In Train: కొడుకు ముందే మహిళపై అత్యాచార యత్నం.. రైలు నుంచి తోసేసిన నిందితుడు

జాతీయ విద్యావిధానానం 2020కి అనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన స్కూల్ బ్యాగ్ పాలసీ 2020కి అనుగుణంగా గైడ్ లైన్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం 1,2 తరగతుల పిల్లలకు హోంవర్క్ ఇవ్వకూడదని సూచించింది. వారి బ్యాగుల బరువు 1.6 నుంచి 2.2 కిలోల మధ్య ఉండాలి. 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువు 1.7 కిలోల నుంచి 2.5 కిలోల వరకు ఉండాలని..6-7 తరగతులకు 2 నుంచి 3 కిలోల వరకు, 8వ తరగతికి 2.5 నుంచి 4 కిలోల వరకు స్కూల్ బ్యాగు బరువును అనుమతించారు. ఇక 9,10 వ తరగతి విద్యార్థుల బ్యాగు బరువు 2.5-4.5 కిలోలుగా ఉండాలని సూచించింది.

ఇక విద్యార్థులకు ఇచ్చే హోం వర్క్ పై కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. 1,2 తరగతుల పిల్లలకు హోం వర్క్ లేకుండా మార్గదర్శకాలు జారీచేసింది. దీంతో పాటు 9-10వ తరగతి విద్యార్థులకు గరిష్టంగా రోజుకు రెండు గంటలు హోం వర్క్ చేయాలని.. 3,4,5 తరగతుల విద్యార్థులు వారానికి గరిష్టంగా రెండుగంటలు హోంవర్క్ ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

Exit mobile version