NTV Telugu Site icon

CM Shivraj Singh Chouhan: మహిళల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న సీఎం.. వీడియో వైరల్..

Shivraj Singh

Shivraj Singh

CM Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అవినీతి మరక లేకుండా గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అయితే ఎంతటి సీఎం అయిన చాలా హుందాగా, క్షమశిక్షణగా ఉండటం శివరాజ్ సింగ్ నైజం. ఓడిపోయినా, గెలిచినా కూడా తాను ఒక సాధారణ బీజేపీ కార్యకర్తను మాత్రమే అని చెబుతుంటారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదుగి, బీజేపీ ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీని అఖండమైన మెజారిటీతో విజయం అందించారు.

Read Also: Joruga Husharuga Trailer: చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా.. పెళ్లిళ్లు చేసేవాడికి పెళ్లిళ్లు అవుతాయా

తాజాగా ఆయన మహిళల కాళ్లు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 230 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ విజయంలో మహిళలు కీలక పాత్ర వహించారని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గమైన చింధ్వారాలో శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపొందారు. అయితే బుధవారం అక్కడ జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో వేదికపై ఇద్దరు మహిళల పాదాలను కడిగారు. గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి, గిరిజనుడిపై మూత్రం పోయడం వివాదాస్పదం అయింది. అయితే ఆ సమయంలో కూడా రాష్ట్రం తరుపున గిరిజనుడి కాళ్లు కడిగారు సీఎం. తాజాగా మహిళలను గౌరవిస్తూ, వారి పాదాలను కడిగారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Show comments